Home Blog Page 91

కొత్తగా యోగా చేస్తున్నారా, బరువు తగ్గించడంతో పాటు ఎన్నో లాభాలనిచ్చే యోగాని షేర్ చేసిన మలైకా అరోరా

0
యోగా అనేది ఎప్పుడు కూడా మనకి మనమే సొంతంగా చేయకూడదు. సరైన గైడెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే, కొత్తగా చేసేవారికి ఏ ఆసనం ఎలా చేయాలి, ఎంత వరకూ చేయాలి ఇలాంటి విషయాలు ఎక్కువగా తెలియదు. అలాంటివారి కోసం బిగినర్ ఫ్రెండ్లీ విన్యాస ఫ్లో అంటూ యోగాసనాన్ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యాక్ట్రెస్ మలైకా అరోరా.
మలైకా పోస్ట్ చేసిన విన్యాస ఫ్లో అనే భంగిమ ఎవరైనా చేయొచ్చొని అని చెప్పారు. అయినప్పటికీ, మొదటిసారి చేసేవారు యోగా నిపుణుల ఆధ్వర్యంలో చేస్తే మంచిది. బ్రీథింగ్‌‌పై ఆధారపడి చేసే ఈ యోగాతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఈ యోగా ఎలా చేయాలి. దీని వల్ల కలిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bank Holidays: ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు.. ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందా? ఇదిగో క్లారిటీ

0
Fact Check: వారానికి ఐదు రోజుల పని దినాల కోసం బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఇస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు అందులో ఉంది. అయితే, ఈ విషయంపై ఫ్యాక్ట్ చెక్ సంస్థ పీఐబీ క్లారిటీ ఇచ్చింది. మరి శనివారాలు బ్యాంకులకు సెలవు ఇస్తూ గెజిట్ విడుదల చేశారా? వివరాలు తెలుసుకుందాం.

BSNL యూజర్లకు బంపర్ ఆఫర్.. ప్రీపెయిడ్ ప్లాన్లతో రూ.1 లక్ష + రూ.10 వేల ఉచిత బెనిఫిట్!

0
BSNL STV Plans: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని రీఛార్జ్ ప్లాన్ల ద్వారా ఏకంగా రూ.1 లక్ష బీమా, రూ.10 వేల బీమా సౌకర్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ మేరకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. మరి ఆ ప్లాన్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వారసత్వంగా వచ్చే ఆస్తిపై 55 శాతం పన్ను.. తెరపైకి సంచలన ప్రతిపాదన.. సామాన్యులు, ధనవంతుల్లో ఎవరిపై ప్రభావం?

0
Inheritance Tax: తాతముత్తాతలు, తల్లితండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిపై భారత్‌లో ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే, ప్రపంచంలోని దిగ్గజ దేశాలకు భారత్ పోటీ ఇవ్వాలంటే వారసత్వంగా వచ్చే ఆస్తిపై పన్ను ఉండాలని, 55 శాతం మేర ట్యాక్స్ విధించాలని హాట్‌మెయిల్ ఫౌండర్ సబీర్ భాటియా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో తీవ్ర చర్చ మొదలైంది. అయితే, ఈ ట్యాక్స్ ధనవంతులు, సామాన్య మధ్య తరగతి ప్రజల్లో ఎవరిపై ప్రభావం పడుతుంది?

SBIలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ATM ఉచిత లావాదేవీల్లో భారీ కోత!

0
SBI Salary Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు శాలరీ అకౌంట్ ఉందా? అయితే ఇది మీకోసమే. వేతన ఖాతాలకు సంబంధించిన ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యలో ఎస్‌బీఐ భారీగా కోత పెట్టింది. ఏకంగా సగానికి తగ్గించింది. పరిమితి తెలుసుకోకుండా ట్రాన్సాక్షన్లు చేస్తే ఆ తర్వాత రుసుములు చెల్లించుకోవాల్సి రావస్తుంది. మరి కొత్త ఉచిత లావాదేవీల సంఖ్య ఎంత ? ఎలాంటి ఛార్జీలు ఉండనున్నాయి? ఆ వివరాలు తెలుసుకుందాం.

Jio Bharat: జియో ధమాకా ఆఫర్.. కేవలం రూ.299కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు ఉచిత రీఛార్జ్!

0
Jio Bharat: పండగల వేళ రిలయన్స్ జియో ధమాకా ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.1499 ధరతో జియో భారత్ ఫోన్ అందిస్తోంది. అంతే కాదు ఈ ఫోన్ కొన్నవారికి 6 నెలల పాటు ఉచిత రీఛార్జ్ లభిస్తుంది. అంటే రూ.1200 పైగా ఆదా చేసుకోవచ్చని జియో తెలిపింది. మరి ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.

భారత పైలట్‌కు ఇజ్రాయెల్ ప్రధాని సెల్యూట్.. హీరో అంటూ ముచ్చర్‌‌పై మోదీ, ట్రంప్ ప్రశంసలు

దుబాయ్ నుంచి టెల్ అవివ్ వెళ్తున్న విమానం కూలిపోకుండా అడ్డుకున్న భారత పైలట్ స్మిత్ ముచ్చర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత పైలట్‌కు సెల్యూట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని సెప్టెంబర్ 11 తరహా దాడులు జరగకుండా ముచ్చర్ అడ్డుకున్నాడని కొనియాడారు. స్మిత్ ముచ్చర్ హీరో అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

గచ్చిబౌలిలో విదేశీయులతో వ్యభిచార దందా.. పోలీసుల అదుపులో ముగ్గురు ఉజ్బెకిస్థాన్‌ యువతులు

0
గచ్చిబౌలిలోని హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఆటను పోలీసులు కట్టించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు యువకులు.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి రూ.13 వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విదేశీ మహిళల పాస్‌పోర్టులు, వీసాలు చెల్లుబాటులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా, మహిళలను హైదరాబాద్‌కు ఎవరు తీసుకొచ్చారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఖైరతాబాద్ ఉపఎన్నిక ఆపేసి.. ముందు నా సంగతి తేల్చండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

0
ఖైరతాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 2024లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని కోరారు. దానం నాగేందర్ ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ విజయారెడ్డి గతంలో పిటిషన్ వేశారు. ఇప్పుడు విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.

ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

0
ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు వ్యవహారంపై దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. చాలాకాలంగా స్థానికంగా నివసిస్తున్న, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లను కూడా తొలగించారని పేర్కొన్నారు. ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈసీ కార్యాలయాన్ని, హైదరాబాద్‌ను తగలబెడతామని హెచ్చరించారు.