ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు వ్యవహారంపై దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. చాలాకాలంగా స్థానికంగా నివసిస్తున్న, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లను కూడా తొలగించారని పేర్కొన్నారు. ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈసీ కార్యాలయాన్ని, హైదరాబాద్‌ను తగలబెడతామని హెచ్చరించారు.
OU Campus Cannabis Plant: ‘ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి మెుక్క మెలవటం ఆశ్చర్యకమైన విషయం’
Osmania University Ganja Plant: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపుతోంది. మొక్క సహజంగా మొలిచిందా? ఎవరైనా నాటారా? గంజాయి సిగరెట్ లేదా విత్తనాల ద్వారా మొలకెత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌లో మరెక్కడైనా ఇలాంటి మొక్కలు ఉన్నాయా అనే అంశంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీ అధికారులు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించాలని, పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, క్యాంపస్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
CMC WhatsApp Complaints: మీ కాలనీలో సమస్య ఉందా? వాట్సాప్‌లో ఫొటోలతో ఫిర్యాదు చేయండి
హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రజలకు కీలక అవకాశం కల్పించింది. కాలనీలు, బస్తీల్లో నెలకొన్న పౌర సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటికి పరిష్కారం పొందేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయి పర్యటనల్లో తన దృష్టికి రాని సమస్యలను తెలుసుకునేందుకు సీఎంసీ కమిషనర్ జి.సృజన 90634 21347 వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని ప్రకటించారు. సమస్యకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు, గూగుల్ లొకేషన్ పంపించాలని సూచించారు.
ఒకే మ్యాచ్‌లో 5 సెంచరీలు.. క్రికెట్ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ ఫీట్ సాధించిన భారత్, వెస్టిండీస్..!
భారత్, వెస్టిండీస్ మధ్య గువహటి వేదికగా జరిగిన రెండో వన్డే ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. వన్డే క్రికెట్ 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో (5023 మ్యాచులు) ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 5 సెంచరీలు నమోదయ్యాయి. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్, షై హోప్, అమిర్ జంగూ శతకాలు బాదారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగి ఈ ఆల్-టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు.
ఏషియన్ గేమ్స్ ఫైనల్ చేరిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లో భారత్ vs పాక్ మ్యాచ్..!
ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ పోటీల్లో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్‌లోని నిస్సిన్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ (80), వైభవ్ సూర్యవంశీ (38) రాణించడంతో భారత్ 169 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో లంకను బుమ్రా, అక్షర్, అభిషేక్ దెబ్బతీయడంతో ఆ జట్టు 45 రన్స్‌కే కుప్పకూలింది. అక్టోబర్ 3న జరగనున్న ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
గిల్ విధ్వంసం, రికార్డుల ప్రవాహం.. గువహటి వన్డేలో బద్దలైన మైలురాళ్లు ఇవే..!
గువహటి జరిగిన భారత్-వెస్టిండీస్ రెండో వన్డే రికార్డుల సునామీ సృష్టించింది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ చరిత్ర సృష్టించడమే కాక, శుభ్‌మన్ గిల్ కేవలం 117 బంతుల్లోనే వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఒకే మ్యాచ్‌లో 5 సెంచరీలు నమోదు కావడం, రోహిత్-గిల్ 255 రన్స్ ఓపెనింగ్ పార్టనర్షిప్ నెలకొల్పడం, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 200 వికెట్ల మార్కును దాటడం ఈ మ్యాచ్‌లోని ప్రధాన విశేషాలు.
లేటు వయసులో రోహిత్ లేటెస్ట్ రికార్డు.. 40 ఏళ్ల నాటి గావస్కర్ రికార్డు బద్దలు..!
గౌహతి వన్డేలో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 75 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డుల సునామీ సృష్టించాడు. భారత గడ్డపై వన్డేల్లో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా, సొంత గడ్డపై వన్డే సెంచరీ బాదిన అత్యంత పెద్దవయస్కుడైన (39 ఏళ్లు) భారత క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ 39 ఏళ్ల నాటి రికార్డును చెరిపివేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12,000 రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.
అత్యవసర చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి దుబాయ్‌కు కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఎయిర్‌లిఫ్ట్
పశ్చిమాసియా గగనతలంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసింది. విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్ ప్రయత్నించడంతో.. కాక్‌పీట్‌లో ఉన్న భారతీయ పైలట్ అతడ్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే పదునైన ఆయుధంతో స్మిత్ మచ్ఛర్‌పై అతడు దాడిచేశాడు. అయినా సరే స్మిత్ అతడి ప్రయత్నాలను నిలువరించి, 180 మంది ప్రాణాలను కాపాడాడు. యావత్తు ప్రపంచం ఆయనను హీరోగా కీర్తిస్తోంది. ప్రస్తుతం ఆయనను వైద్యం కోసం దుబాయ్‌కు తీసుకెళ్తున్నారు.
Gold Smuggling Case: నటి రన్యా రావు బిగ్ షాక్.. రూ.89 కోట్లు జరిమానా.. మరో ముగ్గురికి రూ.155 కోట్లు
గతేడాది మార్చిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి భారీగా బంగారంతో పట్టుబడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరకు ఆమె విదేశాల నుంచి బంగారం అక్రమంగా తీసుకొస్తున్నట్టు విచారణలో తేలింది. ఏడాదిలో పలుసార్లు దుబాయ్ నుంచి 100 కిలోలకుపైగా బంగారాన్ని తీసుకొచ్చినట్టు గుర్తించారు. తాజాగా, నటి రన్యా రావుకు కస్టమ్స్ అధికారులు భారీ ఝలక్ ఇచ్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులకు మొత్తం రూ.239 కోట్లు ఫైన్ వేశారు.
అన్నం పెట్టడం లేదు.. నడవలేకపోతున్నా.. గుండెల్ని పిండేస్తున్న 9 ఏళ్ల పసివాడి ఆవేదన.. చలించిపోయిన మంత్రి నారా లోకేష్
సోషల్ మీడియాలో ఓ బాలుడి వీడియో ఎందరో హృదయాలను కదిలించింది. ప్రకాశం జిల్లా, రాచవారిపాలెంలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు గొర్రెల కాపరిగా కనిపించాడు. అటు వైపుగా వెళ్తున్న ఆ బాలుడిని పలకరించగా.. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. తనకు అన్నం పెట్టడం లేదని, సరిగ్గా నడవలేకపోతున్నానని వాపోయాడు. అన్నా అమ్మకి చెప్పండి తనను తీసుకెళ్లమని అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో వాళ్లు ఆ చిన్నారి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని, అధికారులను వెంటనే స్పందించమని కోరారు. దాంతో మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆ బాలుడికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.

