Andhra Pradesh Birth Death Registration New Rules 2026: ఏపీలో జనన (బర్త్), మరణాల (డెత్) నమోదుకు సంబంధించి కొత్త నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నేటి (అక్టోబర్ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 21 రోజుల్లోగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసోం వివరాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. రెండేళ్లు దాటితే కనుక న్యాయమూర్తి నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.
‘క్షుద్రపూజలు చేస్తున్నారు.. నా మిత్రుడు ఆస్పత్రిలో ఉన్నాడు.. సిద్ధాంతిపై కేసు పెడతా’: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
Janasena Party Mla Bolisetti Srinivas Black Magic Allegations: తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనపై క్షుద్ర పూజలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. ఓ సిద్ధాంతి చేసిన వ్యాఖ్యల తర్వాత తన మిత్రుడు ఆస్పత్రిలో చేరాడని.. ఇంకొకడు పోతాడంటూ ఆ సిద్ధాంతి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు మంచిది కాదన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు
AP High Court Verdict On Bc 34 Percent Reservation Issue: ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన రెండు జీవోలను ధర్మాసనం కొట్టివేసింది. మిగిలిన పిటిషన్లపై కూడా హైకోర్టు తీర్పును వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని ఆదేశించింది.
శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం హైకోర్టులో లాయర్ పోరాటం.. దోర్నాలలో వసతి కోసం పిల్, నోటీసులు జారీ
Srisailam Devotees Dornala Check Post Amenities: ఏపీ హైకోర్టులో శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులకు దోర్నాల చెక్ పోస్టు దగ్గర కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాత్రి సమయంలో ఘాట్ రోడ్డులోకి అనుమతి లేకపోవడంతో.. శ్రీశైలం వెళ్లే భక్తులు కొందరు దోర్నాల చెక్పోస్ట్ దగ్గర ఆగిపోతున్నారని.. వారికి వసతి, భద్రత కల్పించాలని లాయర్ కాశీరావు పిల్ దాఖలు చేశారు.
15 పేద గిరిజన కుటుంబాలకు వారం రోజుల్లో రూ.1.50 కోట్ల ఆస్తి.. అధికారులు కుదరదని చెప్పినా, పోరాడి పట్టాలు అందించిన టీడీపీ ఎమ్మెల్యే
MLA Yarlagadda Venkat Rao Help To 15 Tribel Families: సీనియర్ జర్నలిస్ట్ జాఫర్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలిసి 15 గిరిజన కుటుంబాలకు న్యాయం చేశారు. వారం రోజుల వ్యవధిలో ఎమ్మెల్యే యార్లగడ్డ అధికారులతో పోరాడి పట్టాలు వచ్చేలా చేశారు. ఇరిగేషన్ భూమిలో పట్టాలు సాధ్యం కాదని అధికారులు చెప్పినా సరే వారితో మాట్లాడి అనుకున్నది సాధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఏపీ ప్రజలకు రాయితీపై కందిపప్పు, పామాయిల్, చక్కెర, గోధుమ పిండి.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
AP Govt To Distribute Subsidised Tur Dal Palm Oil Soon: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సబ్సిడీపై బియ్యాన్ని అందిస్తుండగా.. తాజాగా ఉల్లిపాయల్ని కేజీ రూ.35కే అందిస్తోంది. అలాగే త్వరలోనే పామాయిల్, కందిపప్పు, చక్కెర, గోధుమ పిండిని కూడా రాయితీపై అందిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
అనుకున్నది సాధించిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 40 ఏళ్ల కల నిజమైంది, 5 నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం
Nellore Rural Pottepalem Kaluju Bridge Inauguration: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం ఫలించింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అయ్యింది. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పూర్తయ్యింది.. ఈ నెల 2న ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దాదాపు ఐదు నియోజకవర్గాలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 11 ఏళ్లుగా ఈ బ్రిడ్జి కోసం పోరాటం చేశారు.
అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్నా, చివరి దశలో ఏపీకి రావాలని ఉందన్న NRI భరత్.. స్పందించిన లోకేష్, తీసుకొచ్చేందుకు అదొక్కటే సమస్య
Nara Lokesh On Telugu Nri Pulipati Bharat Request Suffered With Cancer: అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతన్న తెలుగు ఎన్ఆర్ఐ పులిపాటి భరత్.. తన సొంత ఊరికి వచ్చి చివరి దశలో కుటుంబంతో గడపాలని ఉందన్నారు. తనకు సాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. భరత్ రిక్వెస్ట్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.. భరత్ ఆరోగ్య పరిస్థితి ప్రయాణం చేయడానికి వీలుగా లేని డాక్టర్లు చెప్పినట్లు వివరించారు. భరత్ కుటుంబంతో తాము టచ్లో ఉన్నామని తెలిపారు.

