Home Blog Page 68

ఘటన గురించి తెలియగానే ‘మా బిడ్డను కాపాడమని దేవుడ్ని వేడుకున్నా’ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తండ్రి భావోద్వేగం

0
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోన్న విమానంలో కో-పైలట్.. కెప్టెన్‌ స్మిత్ మచ్ఛార్‌పై పదునైన ఆయుధంతో దాడి చేయడం, ఆపై కూల్చివేయడానికి యత్నించాడు. కానీ, అతడి కుట్రలను కెప్టెన్ స్మిత్ భగ్నం చేశారు. తన తీవ్రంగా గాయపడినా మనో ధైర్యం కోల్పోలేదు. తన కోసం కాకుండా విమానంలోని 180 మంది ప్రాణాలు కోసం ఆలోచించారు. దీనిపై ఆయన తండ్రి భూపేంద్ర మచ్ఛార్ తాజాగా స్పందించారు. ఆయన తన కుమారుడి ధైర్యసాహసాలపై భావోద్వేగానికి గురయ్యారు.

ఉసురు తీసిన రాకాసి అల, విశాఖ బీచ్‌లో విహారయాత్రలో ఘోరం.. ఇంకా దొరకని రెండు మృతదేహాలు

విశాఖపట్నం తీరంలో విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో రుషికొండ ఐటీ హిల్స్ సమీపంలోని బీచ్‌కు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎగసిపడ్డ అలల ఉధృతికి ఈత కొడుతున్న సూర్యప్రకాశ్, నితీశ్, ప్రశాంత్ అనే ముగ్గురు విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. గల్లైంతన పిల్లల కోసం అధికారులు గాలింపు చేపట్టారు. ప్రశాంత్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బీచ్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఉచిత పథకాలు కాదు.. మౌలిక వసతులే ముఖ్యం: స్థానిక పోరులో ‘ఏకం’ పేరుతో కేకే సర్వే కిరణ్ పొలిటికల్ ఎంట్రీ

ఏపీ ఎన్నికల్లో తన సర్వేతో సంచలనం సృష్టించిన కిరణ్ కొండేటీ మరో సంచలన నిర్ణయంతో ముందుకొచ్చారు. ఏకం పేరుతో తన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోరులో అభ్యర్థుల్ని నిలబెట్టబోతున్నట్టు వెల్లడించారు. అంతే కాదు ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై సర్వే చేసినట్టు చెప్పారు. ప్రజలు ఉచిత పథకాలను కోరుకోవడం లేదని, మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగాలు, వసతులు కోరుకుంటున్నారని తన సర్వేలో తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా సమస్యల మీద పోరాడే ప్రతి అభ్యర్థికి తాను అండగా నిలబడతానని ఆయన అన్నారు.

మరోసారి వాతావరణ హెచ్చరిక: అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం

వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ వాతావరణానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అధికారులు చెప్పిన ప్రకారం అక్టోబర్ 12వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా బలపడనుంది. అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని సంబంధిత అధికారులు తెలియజేశారు.

రాయలసీమ పాలెగాళ్లే విజయ్ దేవరకొండ పాత్రకి స్ఫూర్తి.. ‘రణబాలి’ డాక్యుమెంటరీ మూడో ఎపిసోడ్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న ‘రణబాలి’ మూవీ ప్రమోషనల్ డాక్యుమెంటరీ సిరీస్ నుంచి మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వియ్ ఫర్ గాట్’ విడుదలయ్యింది. రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళ్‌రెడ్డి, బొబ్బిలి నాగిరెడ్డి వంటి పాలెగాళ్ల వీరోచిత గాథల ఆధారంగా విజయ్ దేవరకొండ పాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వివరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది.

రామ్ చరణ్ ‘RC 17’ క్రేజీ అప్డేట్.. పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న సుకుమార్.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC 17’పై ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఏడాది వ్యవధిలోనే షూటింగ్ పూర్తి చేయడమే లక్ష్యంగా సుకుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.

‘సిగ్మా’ రివ్యూ – Sigma Review

Sigma Movie Review సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేశారు. ఇక ఈ చిత్రం జాసన్ సంజయ్ దర్శకుడిగా విజయాన్ని అందుకున్నాడా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్‌ మున్ముందు దర్శకుడిగా నిలబడతాడా? లేదా? అన్నది చూద్దాం.

ఈవీవీ మార్క్ రియలిస్టిక్ బోల్డ్ డ్రామా.. : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

దివంగత దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2004లో విడుదలై దాంపత్య జీవితాల్లోని సమస్యలు, వివాహ వ్యవస్థలోని భిన్న కోణాలను ఎంతో బోల్డ్‌‌గా, వినోదభరితంగా ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 42 మంది కొత్త నటీనటులతో పాటు ఎల్.బి. శ్రీరామ్, చలపతిరావు వంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుత తరానికి కూడా కనెక్ట్ అయ్యే కథ కావడంతో ఈ రీ-రిలీజ్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ : వెంకటేష్, శ్రీవిష్ణులతో తలపడనున్న ‘హనుమాన్ అంశ్’

కేవలం రూ. 2 కోట్ల స్వల్ప వ్యయంతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన ఆధ్యాత్మిక అద్భుతం ‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. డబ్బింగ్ కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం దసరా సీజన్‌లో విడుదలవుతోంది.

షుగర్‌ కంట్రోల్‌కు ఇంటి చిట్కాలు, మన పెరట్లో ఉండే జామాకులు + కరక్కాయ బెస్ట్‌ ఆప్షన్‌!

0
మన దేశంలో డయాబెటిస్‌ వేగంగా విస్తరిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్‌ స్టేజ్‌లో ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, చెడు ఆహార అలవాట్లు, అధిక బరువు, లైఫ్‌స్టైల్‌, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర వంటి అంశాలు టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రారంభ దశలోనే సరైన ఆహార నియమాలు, కొన్ని చిట్కాలు పాటిస్తే డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.

షుగర్‌ ఉందని తెలిసిన తర్వాత ఆహారం విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు మొదలవుతాయి. ఏం తినాలి, ఏవి తగ్గించాలి ఇంట్లో దొరికే పదార్థాలతో షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చా అనే ఆలోచన వస్తుంటుంది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇంటి చిట్కాలు ఎలా ఉపయోగపడతాయి, వీటిని ఎలా తీసుకోవాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.