దివంగత దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2004లో విడుదలై దాంపత్య జీవితాల్లోని సమస్యలు, వివాహ వ్యవస్థలోని భిన్న కోణాలను ఎంతో బోల్డ్‌గా, వినోదభరితంగా ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 42 మంది కొత్త నటీనటులతో పాటు ఎల్.బి. శ్రీరామ్, చలపతిరావు వంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుత తరానికి కూడా కనెక్ట్ అయ్యే కథ కావడంతో ఈ రీ-రిలీజ్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ఈవీవీ మార్క్ రియలిస్టిక్ బోల్డ్ డ్రామా.. : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
RELATED ARTICLES


