Home Blog Page 69

ఇంట్లో ఈ ప్రదేశాల్లో తాబేలు విగ్రహాన్ని ఉంచితే అదృష్టం

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. అయితే తాబేలు బొమ్మ విషయంలో ఫాలో అవ్వాల్సిన వాస్తు రూల్స్‌ ఇవే.

క్యాబేజీ కందిపప్పు పచ్చడి చేసే విధానం

మీరు ఇంట్లో రుచికరమైన క్యాబేజీ కందిపప్పు పచ్చడి చేసుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ పద్ధతి ఫాలోకండి.

ఆ రిసార్ట్ అమ్ముకోకుండా ఉంటే నవదీప్ రూ.వందల కోట్లకు అధిపతి… సీక్రెట్ బయటపెట్టిన అజయ్ ఘోష్

సినీ వేదికలపై హీరోల ఆస్తులపై నటుడు అజయ్ ఘోష్ చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 2002లో నవదీప్ తండ్రి రామారావు చీరాల బీచ్ సమీపంలో ‘రామాపురం రిసార్ట్స్’ ప్రారంభించారని, హైదరాబాద్ వచ్చే క్రమంలో దాన్ని అమ్మేశారని తెలిపారు. ప్రస్తుతం ‘ఆంధ్రా గోవా’గా మారిన ఆ ప్రాంతంలో ఆస్తిని అమ్మకుండా ఉంటే నవదీప్ వందల కోట్ల ఆస్తిపరుడయ్యేవాడని పేర్కొన్నారు. గతంలో రవితేజ మామిడి తోట విలువలపైనా ఇలాగే మాట్లాడిన అజయ్ ఘోష్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా వేదికలపై పక్కోళ్ల ఆస్తులు, రియల్ ఎస్టేట్ లావాదేవీలపై లెక్చర్లు ఇవ్వడం ఎందుకంటూ కొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.

Mayalodu Controversy: ‘నేను లేకుండా సినిమా ఎలా తీస్తావో చూస్తా’… రాజేంద్ర ప్రసాద్‌కు ఎస్వీ కృష్ణారెడ్డి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్

1993 నాటి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘మాయలోడు’ షూటింగ్ సమయంలో నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో తలెత్తిన వివాదంపై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా చివరి దశలో రెయిన్ సాంగ్ కోసం డేట్లు ఇవ్వని రాజేంద్ర ప్రసాద్, “నేను లేకుండా సినిమా ఎలా పూర్తి చేస్తావో చూస్తా” అని సవాల్ విసిరారట. దీంతో తీవ్రంగా కలత చెందిన దర్శకుడు, గతంలో బాబూ మోహన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆ డ్యూయెట్‌ను బాబూ మోహన్, సౌందర్యలపై చిత్రీకరించారు. ఆ పాటే “చినుకు చినుకు అందెలతో”గా వెండితెరపై సంచలనం సృష్టించింది. ఒక కమెడియన్‌తో డ్యూయెట్ చేయించి సూపర్ హిట్ కొట్టిన తొలి దర్శకుడిగా నిలిచానని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు.

Chuttamalle: అసహ్యకరం.. సిగ్గుచేటు: .. ‘చుట్టమల్లే’ సాంగ్ ఏఐ మార్ఫింగ్‌‌పై ఎన్టీఆర్ సీరియస్

‘దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే” పాటకు సంబంధించిన విజువల్స్‌ను కొందరు ఏఐ టూల్స్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను దేవతలుగా పూజించే గడ్డపై ఇంతటి పైశాచిక చర్యలకు దిగజారడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ మార్ఫింగ్ వీడియోల వెనుక ఉన్నవారిపై, దీన్ని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌‌ను ఎవరూ చూడొద్దని, రేపు ఇది మీ ఇంట్లోని వాళ్లకూ ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Chuttamalle: ‘చుట్టమల్లే’ పాటకు ఏఐ వికృత చేష్టలు… ఎన్టీఆర్, జాన్వీల మార్ఫింగ్ వీడియోలపై భగ్గుమంటున్న నెటిజన్లు

‘దేవర’ సినిమాలోని చార్ట్‌బస్టర్ సాంగ్ “చుట్టమల్లే” చుట్టూ ఏఐ ఆధారిత సరికొత్త వివాదం చెలరేగింది. కొందరు డిజిటల్ క్రియేటర్లు ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల హావభావాలను మార్చేసి పాటలో లేని అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాలను సృష్టిస్తున్నారు. ఇది అసలైన పాటలోని విజువల్సేనని భ్రమపడుతుండటంతో నటీనటుల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో వ్యక్తుల గౌరవాన్ని దిగజార్చేలాంటి మార్ఫింగ్ క్లిప్పులు రూపొందించిన వారిని తక్షణమే గుర్తించి, జైలుకు పంపాలని నెటిజన్లు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

‘మీ సాహసం దేశానికే గర్వకారణం’… రియల్ హీరో కెప్టెన్ స్మిత్‌ మచ్చర్‌పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి చేసినప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తీవ్ర గాయాల పాలైన స్థితిలోనూ ఒంటిచేత్తో పోరాడి వందలాది ప్రాణాలను నిలబెట్టిన ఆయన ధైర్యం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి తన మనసు చలించిందని చెబుతూ, ఆంజనేయస్వామి ఆశీస్సులతో స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చేపలు కొనేటప్పుడు ఏవి పడితే కొనొద్దు, తాజా చేపల్ని ఎలా గుర్తించాలంటే

0
మార్కెట్లోకి అడుగుపెట్టగానే కూరగాయలన్నీ ఒకవైపు ఉంటే చేపలు అమ్మే ప్రదేశం మరోవైపు ఉంటుంది. కారణం కాస్తా వాసనలు వస్తుంటాయి. ఇవి అందరికీ నచ్చవు. ఒక్కోసారి తినేవారికి కూడా ఆ వాసనలు పడకపోవచ్చు. దీంతో అక్కడికి వెళ్లి అక్కడ ఎక్కువ సమయం ఉండడం కంటే అమ్మేవారు ఇచ్చే చేపల్ని రేటు మాట్లాడి తీసుకొస్తుంటారు. మరి అవి మంచివా కాదా ఎలా తెలుసుకోవాలని ఆలోచించరు. ఏ చేపలైనా ఒకటేగా అనుకుంటారు. కానీ, అస్సలు కాదు. తాజా చేపలు, కుళ్ళిన చేపలకి చాలా తేడా ఉంటుంది. తాజా చేపల బదులు కుళ్ళినవి వండుకుంటే నోటికే కాదు, ఆరోగ్యానికి కూడా అస్సలు మంచివి కాదు. అలాంటప్పుడు మరి తాజా చేపల్ని ఎలా గుర్తించాలి. తాజా చేపల్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి విషయాలని గమనిస్తే చేపలు తాజాగా ఉన్నాయో ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు

0
రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మన దృష్టి సాధారణంగా మెనూ, ఆహారం రుచి, ధర, సర్వీస్‌పైనే ఉంటుంది. అయితే టేబుల్‌పై మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యమైనది. ఇంట్లో భోజనం చేసేటప్పుడు సహజంగా చేసే కొన్ని పనులు బయట అందరి ముందు చేయడం సరైనదిగా భావించరు. ముఖ్యంగా ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు కొన్ని చిన్న నియమాలను పాటించడం ద్వారా మనతో పాటు టేబుల్‌పై ఉన్న ఇతరులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అందుకే రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన టేబుల్‌ ఎటికెట్‌ ఏమిటో తెలుసుకుందాం.

ఆకుకూరల్ని ఫ్రిజ్‌లో పెట్టినా పాడవుతున్నాయా, కొన్ని కూరగాయల మధ్య అస్సలు పెట్టొద్దు అవేంటంటే

0
​ఆకుకూరలు తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ అవి ఫ్రెష్‌గా ఉండవు. పైగా వడలిపోయినట్లుగా ఉంటాయి. కొన్నిసార్లు తేమ ఎక్కువై మరీ మెత్తగా అయిపోతుంటాయి. ఇలాంటివాటిని చూసి అసలు వండాలనిపించదు కూడా. అలాంటప్పుడు వీటిని కొనుక్కొచ్చి ఫ్రిజ్‌లో ఉంచి మరీ పారేస్తుంటాం. అలా కాకుండా వండినప్పుడే తీసుకొద్దామంటే వండాలనుకున్నప్పుడే మార్కెట్‌‌కి వెళ్ళం. కాబట్టి, ముందుగానే తెచ్చేసి పెట్టుకుంటాం. అలా తీసుకొచ్చి స్టోర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు ఆకుకూరలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుని తీరాలి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం కొనుక్కొచ్చి తిరిగి వండేవరకూ తాజాగానే ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటంటే