దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోన్న విమానంలో కో-పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై పదునైన ఆయుధంతో దాడి చేయడం, ఆపై కూల్చివేయడానికి యత్నించాడు. కానీ, అతడి కుట్రలను కెప్టెన్ స్మిత్ భగ్నం చేశారు. తన తీవ్రంగా గాయపడినా మనో ధైర్యం కోల్పోలేదు. తన కోసం కాకుండా విమానంలోని 180 మంది ప్రాణాలు కోసం ఆలోచించారు. దీనిపై ఆయన తండ్రి భూపేంద్ర మచ్ఛార్ తాజాగా స్పందించారు. ఆయన తన కుమారుడి ధైర్యసాహసాలపై భావోద్వేగానికి గురయ్యారు.


