తెలంగాణలో ఆటో ప్రయాణికులకు కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ రేట్లను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14గా నిర్ణయించారు. డిటెన్షన్ ఛార్జీ నిమిషానికి 75 పైసలకు పెరిగింది. నిబంధనలకు లోబడి అదనపు లగేజీకి ఒక్కో ప్యాకేజీకి 50 పైసలు వసూలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాలి. కొత్త రేట్లకు అనుగుణంగా మీటర్లు సవరించుకునేందుకు ఆటో డ్రైవర్లకు 3 నెలల గడువు ఇచ్చారు.
రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం.. సిరిసిల్ల సభకు కౌంటర్‌గా కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ: మాజీమంత్రి తలసాని
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభకు కౌంటర్‌గా కొడంగల్‌లో బీఆర్‌ఎస్ భారీ సభ నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సిద్దిపేటలో సీఎం సభ తర్వాత కొడంగల్‌లో తమ పార్టీ సభ ఉంటుందని ఆయన తెలిపారు. కొడంగల్ సభతో రేవంత్‌రెడ్డికి చెమటలు పట్టిస్తామని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో బలప్రదర్శన అవసరం లేదని విమర్శించారు. ఇదే సమయంలో ఖైరతాబాద్ ఉపఎన్నికపై కూడా తలసాని స్పందిస్తూ బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దిల్‌సుఖ్‌నగర్ ఆలయంలో దారుణం.. అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి, సీసీటీవీ వీడియో వైరల్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై కర్రతో దాడికి ప్రయత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కూడా కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనను గమనించిన భక్తులు వెంటనే అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీటీవీలో ఈ ఘటన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్ పోలీస్‌లో భారీ మార్పులు.. 76 ప్రాంతాల్లో జోన్లు, డివిజన్ల ఛేంజ్, ఎయిర్‌పోర్టు పీఎస్‌కు కొత్త పేరు
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. హోంశాఖ జారీ చేసిన కొత్త జీవో ప్రకారం నగరంలోని మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేశారు. ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును శంషాబాద్ పీఎస్‌గా.. ఆర్‌జీఐఏ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా మార్చారు. చిక్కడపల్లి డివిజన్ కాచిగూడగా.. సంతోష్‌నగర్ డివిజన్ ఛత్రినాకగా మారింది. బడంగ్‌పేట్ పీఎస్‌ను రద్దు చేసి దాని పరిధిలోని ప్రాంతాలను ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ, జోనల్ సైబర్ సెల్‌ల పరిధుల్లోనూ మార్పులు చేశారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికలు లేకుండానే నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించవచ్చు.. దానం ఎపిసోడ్‌పై విజయారెడ్డి కామెంట్స్
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల్లో దానం నాగేందర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి.. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. దానం ఎన్నిక చెల్లదని తేలితే తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె తాజాగా వ్యాఖ్యానించారు. ఎన్నికల పిటిషన్‌లో తీర్పు రాకముందే అదే స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన న్యాయ సూత్రాలను ఆమె ప్రస్తావించారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు కేసులో దానం అనర్హతకు గురై ఖైరతాబాద్ స్థానం ఖాళీగా మారింది. దీంతో విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.
ఐసీసీ కొత్త రూల్స్.. పగటి పూట పింక్ బాల్ టెస్టులు.. టైమ్ వేస్ట్ చేస్తే 5 రన్స్ పెనాల్టీ!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త ప్లేయింగ్ కండిషన్స్ అమల్లోకి తెచ్చింది. వెలుతురు లేమి సమస్యను నివారించేందుకు పగటి పూట పింక్ బాల్ వాడే ట్రయల్స్‌కు అనుమతిచ్చింది. బ్యాటర్లు సమయం వేస్ట్ చేస్తే తొలి రెండు సార్లు హెచ్చరించి, మూడోసారి నుంచి ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయిస్తుంది. వైడ్ బాల్ నిబంధనను పర్మినెంట్ చేయడంతో పాటు, రనౌట్/స్టంపింగ్స్ కోసం బంతిపై ‘పూర్తి నియంత్రణ’ తప్పనిసరి చేస్తూ నిబంధనలను స్పష్టం చేసింది.
2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్ ఏంటి? గ్రూప్‌లు, జట్ల వివరాలు ఇవే..!
2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. 2015 తర్వాత మళ్లీ 14 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని ఐసీసీ మూడు దశల్లో నిర్వహించనుంది. మూడు క్వాలిఫయర్ల మధ్య ‘సూపర్ సిరీస్’, ఆపై 6 జట్ల చొప్పున రెండు గ్రూప్‌ల లీగ్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి. ఆపై టాప్-7 జట్లతో ‘సూపర్ 7’ రౌండ్ జరగనున్నాయి. చివరగా టాప్-4 జట్లు సెమీస్, ఫైనల్ ఆడనున్నాయి.
అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకే ప్రపంచకప్‌లో 3 సార్లు భారత్ vs పాక్ మ్యాచ్..!
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఏకంగా మూడుసార్లు తలపడే అవకాశముంది. గ్రూప్-ఏ లో ఉన్న ఇరు జట్లు అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లో తొలిసారి ఢీకొంటాయి. ఇరు జట్లు సూపర్ 7 దశకు అర్హత సాధిస్తే నవంబర్ 7న కేప్‌టౌన్‌లో రెండోసారి తలపడతాయి. నాకౌట్స్ లేదా ఫైనల్ చేరితే నవంబర్ 17/18 లేదా 21న మూడోసారి పోరాడే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు 8-0 అజేయ రికార్డు ఉంది.
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పీసీపీ అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా రాజీనామా
వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంపై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇలాంటి తరుణంలో పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తన రాజీనామా లేఖను అగ్రనేత రాహుల్ గాంధీకి సమర్పించారు. అయితే, తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన పేర్కొన్నారు. వారింగ్ స్థానంలో హిందూ నేత ఇందర్ సింగ్లాకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.
SIRపై నిరసనలతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ నిలిపివేత, పోలీసుల అదుపులో 700 మంది
ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశాయి. అటు, కాక్రోచ్ జనతా పార్టీ సైతం అక్టోబరు 2 నుంచి దీనిపై ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయిలో సీజేపీ ఆందోళన మొదలైంది. అయితే, జంతర్ మంతర్ వద్ద ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూడా నిరసనల్లో పాల్గొన్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వందల మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంటర్నెట్ నిలిపివేశారు.

