HomeTELANGANAదిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.. అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి, సీసీటీవీ వీడియో వైరల్

దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో దారుణం.. అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి, సీసీటీవీ వీడియో వైరల్

దిల్‌సుఖ్‌నగర్‌ సంతోషిమాత ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై కర్రతో దాడికి ప్రయత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కూడా కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనను గమనించిన భక్తులు వెంటనే అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీటీవీలో ఈ ఘటన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments