Central Govt Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏటా రెండు సార్లు కేంద్రం డీఏ, డీఆర్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. తొలి అర్ధభాగంలో ఏప్రిల్ నెలలో డీఏ పెంపు ప్రకటించగా ఇప్పుడు రెండో అర్ధభాగంలో డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి డీఏ 3-4 శాతం వరకు పెరిగి 63-64 శాతం వరకు పెరగొచ్చని అంచనా. అయితే ఈసారి దసరాకు ముందే ప్రకటన రావొచ్చని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.
షాపింగ్ మాల్స్ కంటే హైస్ట్రీట్ షాపులకే డిమాండ్.. లీజింగ్‌లో భారీ మార్పు.. ఏకంగా 38 శాతం పతనం!
Retail Leasing India 2026: దేశంలో రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే తీవ్ర అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా 2026 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 8 ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఏకంగా 38 శాతం తగ్గింది. ఇదే సమయంలో హైస్ట్రీట్ లీజింగ్ మాత్రం 33 శాతం పెరిగింది. ఇక్కడ ప్రీమియం మాల్ స్పేస్ కొరత, తక్కువ ఖాళీ స్థలాలు దీనికి ప్రధాన కారణంగా తెలు
SORRY SUGAR: మొదటి నెలలోనే రూ. కోటి ఆదాయం.. కాఫీ స్టార్టప్ సంచలనం.. 100 + స్టోర్లకు ప్లాన్!
Zero Sugar Coffee Brand: గురుగ్రామ్‌కు చెందిన క్లీన్ లేబుల్ బేవరేజ్ స్టార్టప్ సారీ షుగర్ (SORRY SUGAR) ప్రారంభించిన తొలి నెలలోనే ఏకంగా రూ. 1 కోటికిపైగా ఆదాయం ఆర్జించింది. తొలి సీడ్ రౌండ్‌లో ఒక మిలియన్ డాలర్లు సమీకరించిన సంస్థ 2027 చివరి నాటికి ఏకంగా 100కుపైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి దిల్లీ, గురుగ్రామ్‌లో కలిపి 3 స్టోర్లు ఉన్నాయి.
రూ. 15 వేల సిప్‌తో 15 ఏళ్లలోనే కోటీశ్వరులయ్యారు.. ఈ 10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో పట్టిందల్లా బంగారమే!
Best Mutual Funds SIP: మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ చిన్న మొత్తాల్లో పెట్టుబడితోనూ ఆర్థిక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్‌లో మెరుగైన రాబడి వస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా ఇక్కడ సంపద విపరీతంగా పెరుగుతుంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కేవలం రూ. 15 వేల సిప్ పెట్టుబడి పెట్టిన వారిని 15 ఏళ్లలో కోటీశ్వరుల్ని చేయడం విశేషం. వీటి గురించి ఇప్పుడు చూద్దాం.
BSNL రూ.51 ప్లాన్.. అపరిమిత కాల్స్+ రోజుకు 2GB+ 28 రోజుల వ్యాలిడిటీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!
BSNL Rs 51 Plan: ఓ వైపు మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తురణంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కొత్త యూజర్ల కోసం రూ. 51 ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్న ప్లాన్ తీసుకొచ్చింది. అక్టోబర్ 31వ తేదీలోపు కొనే వారికే వర్తిస్తుంది. మరి ఈ ప్లాన్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
పశ్చిమాసియాకు మరో 10 వేల మంది సైనికులతో అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి?
పశ్చిమాసియాలో యుద్ధానికి శుభం కార్డు వేయడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా లేరని ఆయన చేస్తోన్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ.. మళ్లీ పశ్చిమాసియాకు భారీ ఎత్తున బలగాలను పంపడం చర్చనీయాంశంగా మారింది. నవంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత ఇరాన్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో విమానవాహక నౌక, మరో 10 వేల మంది సైనికులను అమెరికా పంపుతోంది.
ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యంతోనే ఫ్లైదుబాయ్ విమానంలో ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
రెండు రోజుల కిందట దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై దాడిచేసిన కో- పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమాన్ దేశానికి చెందిన పౌరుడు టెల్ అవీవ్‌కు వెళ్లే విమానం నడపడానికి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీనికంతటికి ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యమే కారణమని తాజాగా నివేదిక ఒకటి పేర్కొంది.
“ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ప్రధాని మోదీ వద్ద మంచి ఉపాయాలున్నాయి”: పుతిన్
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద పరస్పర ఆమోదయోగ్యమైన మంచి శాంతి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. తమ మధ్య మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ.. కలిసినప్పుడల్లా ప్రధాని మోదీ యుద్ధ ముగింపు గురించి ఒత్తిడి తెస్తుంటారని వెల్లడించారు. అలాగే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచ దేశాలన్నింటికీ గొప్ప ఆదర్శమని పుతిన్ కొనియాడారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
“నన్ను చంపేయండి, నన్ను చంపేయండన్నాడు”: ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన నెతన్యాహు!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావానికి గురయ్యాడని, ఆత్మహత్య ధోరణితోనే విమానంతో సహా అంతమవ్వాలని కుట్ర పన్నాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రయాణికులు కట్టడి చేసినప్పుడు “నన్ను చంపేయండి, నన్ను చంపేయండి” అని అతడు అరిచాడని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ ఘటనపై యూఏఈ ప్రభుత్వం ఉగ్రవాద కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ.30.. 12 ఏళ్ల తర్వాత కొత్త రేట్లు
తెలంగాణలో ఆటో ప్రయాణికులకు కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ రేట్లను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14గా నిర్ణయించారు. డిటెన్షన్ ఛార్జీ నిమిషానికి 75 పైసలకు పెరిగింది. నిబంధనలకు లోబడి అదనపు లగేజీకి ఒక్కో ప్యాకేజీకి 50 పైసలు వసూలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాలి. కొత్త రేట్లకు అనుగుణంగా మీటర్లు సవరించుకునేందుకు ఆటో డ్రైవర్లకు 3 నెలల గడువు ఇచ్చారు.

