తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 93 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటివరకు 71 లక్షల మందికిపైగా ఓటర్లు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హత సాధించారు. దాదాపు మరో 96 వేల మందికి నోటీసులు డెలివరీ కావాల్సి ఉంది. క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగనుంది. అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దీంతో ఎస్ఐఆర్ పూర్తి తర్వాత రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యపై పూర్తి స్పష్టత రానుంది.
Special Trains: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి తీపి కబురు.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్లు, షెడ్యూల్ ఇదే
Hyderabad to ap Special Trains: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. సికింద్రాబాద్–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, విశాఖపట్నం–బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు, నర్సాపూర్–తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ కొనసాగింపు వంటి నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
58 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో గ్రహాలు, నక్షత్రాల అరుదైన కలయిక వేళ ఈ 3 రాశులకు విశేష ప్రయోజనాలు!
Shardiya Navratri 2026: హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 11న ఆదివారం నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తొమ్మిది రోజుల కాలంలో అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దాదాపు 58 సంవత్సరాల తర్వాత శారదీయ నవరాత్రుల సమయంలో మొదటి రోజు సూర్యోదయం సమయంలో హస్తా నక్షత్రం మరియు శుక్ల యోగాల ప్రభావం ఉంటుంది. అంతేకాదు గురు, చంద్రుల కేంద్ర సంబంధం వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో శని మీనరాశిలో సంచారం చేయడం కీలకంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా గ్రహాల స్థానాలు మరియు శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు మంచి విజయం సాధించొచ్చు. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి నవరాత్రుల వేళ శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. సపోర్ట్ స్టాఫ్‌ను వీడిన ఇద్దరు ఆస్ట్రేలియా దిగ్గజాలు!
ఐపిఎల్ 2027 టోర్నీకి ముందే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి గట్టి షాక్ తగిలింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్ నుంచి ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ రాజీనామా చేశారు. ఇప్పటికే స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే టీమిండియా కోచింగ్ బృందంలో చేరేందుకు వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురి స్థానాలను భర్తీ చేసేందుకు డిసెంబర్‌లో జరిగే వేలానికి ముందే కొత్త కోచ్‌లను ఎంపిక చేసే బాధ్యతను పంజాబ్ యజమాన్యం పాంటింగ్‌కే అప్పగించింది.
శ్వాస సాధన టీనేజ్ అమ్మాయిల్లో ఒంటరితనాన్ని తగ్గించడంలో సహాయపడతుందా? WHO అధ్యయనంలో వెలుగులోకి
కౌమారం మనిషి జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఒత్తిడి, వ్యాకులతతో కూడుకున్న ఈ దశలో శారీరక, మానసిక, సామాజిక మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. దీనివల్ల టీనేజర్లు తీవ్రమైన ఒత్తిడికి, వ్యాకులతకు గురవుతారు. ముఖ్యంగా బాలికల్లో శారీరంలో అకస్మాత్తుగా జరిగే మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల భావోద్వేగాలు వేగంగా మారిపోతుంటాయి. ఇక, టీనేజ్ అమ్మాయిలు తమ చుట్టూ ఎంత మంది ఉన్నా లోలోపల మాత్రం తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఇలాంటి ఒంటరితనం శ్వాస సాధన ద్వారా అధిగమించవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.
నా భర్త పేరుతో ఎలాంటి కొత్త పార్టీకి అనుమతించొద్దు.. ఈసీని ఆశ్రయించిన మాజీ సీఎం భార్య
సుదీర్ఘకాలంపాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన దివంగత వీరభద్ర సింగ్ వారసత్వంపై రాజకీయ పోరు నెలకుంది. ఆయన పేరుతో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భర్త పేరు మీద ఎటువంటి రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడానికి అనుమతించవద్దని కోరుతూ వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కొత్త పార్టీ ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని, తన భర్త పేరుపై మాత్రమే అభ్యంతరం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
కో-పైలట్ దాడిలో గాయపడ్డ కెప్టెన్ స్మిత్ కోలుకుంటున్నారు: విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి అబుదాబి ఆసుపత్రిలో చేరిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, శస్త్రచికిత్స తర్వాత ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం వైద్యులు, స్థానిక అధికారులు, పైలట్ కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ప్రతీ ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తెలపాల్సిందే: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సర్కారు సంచలన ఆదేశాలు
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు అందరూ తమ స్థిర, చరాస్తులతో పాటు అప్పుల వివరాలను ఐఎఫ్‌హెచ్‌ఆర్‌ఎంఎస్ (IFHRMS) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా ఆస్తుల సమర్పణ పూర్తి చేయని ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని, ఈ వివరాలను ఉద్యోగుల యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ACR)లో నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు భద్రత పెంపు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ మరింత పటిష్టం: ‘SIR’ నిరసనల వేళ సర్కారు నిర్ణయం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వివాదంపై ప్రతిపక్షాల నిరసనలు మిన్నంటిన వేళ.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భద్రతను అధికారులు పటిష్టం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం, ఆగ్రాలోని కుటుంబ సభ్యుల ఇల్లు, ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఆందోళనలు జరగడంతో భద్రతా అంచనా ఆధారంగా ఆయనకున్న ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీని మరింతగా పెంచుతూ… అదనపు బలగాలను కేటాయించారు. దీంతో ఇప్పుడు ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమే తన పనులు చేస్కుంటున్నారు.
గుండె ఆగుతున్నా స్టీరింగ్ వదల్లేదు.. 40 మంది ప్రయాణికులను కాపాడి కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్
అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులున్న కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఆర్టీసీ డ్రైవర్‌కు గుండె నొప్పి వచ్చింది. తునిలో ఆయనకు ఛాతిలో నొప్పి మొదలవ్వగా.. నక్కపల్లి వరకు ఓర్చుకున్నారు. అక్కడ నొప్పి ఎక్కువవడంతో ఆయన ముందు ప్రయాణికుల కోసం ఆలోచించి.. సేఫ్ ప్లేస్‌లో బస్సును ఆపి.. సీటులోనే కుప్పకూలిపోయారు. దాంతో ప్రయాణికులు ఆయనకు సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.

