Home Blog Page 18

పెన్షనర్లకు SBI గుడ్‌న్యూస్.. ఇంట్లో నుంచే DLC సమర్పణకు అవకాశం.. ప్రాసెస్ సహా పూర్తి వివరాలు ఇవే!

0
SBI DLC: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాధి మంది పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ బ్యాంక్ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి పెన్షన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందవచ్చని తెలిపింది. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపింది. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఇంట్లో నుంచే పూర్తి చేసేందుకు ఏం చేయాలి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

TCS Q2 Results: టీసీఎస్‌కు రూ.13,884 కోట్ల లాభం.. షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్.. రూ.12 చొప్పున డివిడెండ్ ప్రకటన

0
TCS Q2 Results: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అదరగొట్టింది. జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో కంపెనీకు రూ.13,884 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లాభం 15 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పింది. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తామని ప్రకటన చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

ఇన్వెస్టర్లకు RBI గుడ్‌న్యూస్.. ఇక ఒకేచోట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ FD వివరాలు.. CAS స్టేట్మెంట్ ప్రయోజనాలివే!

0
CAS Statement: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇక నుంచి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ వివరాలు ఇకపై ఒకే చోట కనిపించనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన తెచ్చింది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు బ్యాంకు డిపాజిట్ వివరాలు కూడా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (CAS)లో చేర్చాలని RBI ప్రతిపాదించింది. డిసెంబర్ 31, 2026 నాటికి ఈ కొత్త విధానం అమలు లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

Ola Rights Issue: ఓలా రూ. 1000 కోట్ల రైట్స్ ఇష్యూ.. 26 శాతం డిస్కౌంట్‌ ధరకే షేర్లు ఆఫర్.. దీని వల్ల లాభమా? నష్టమా?

0
Ola Share Price Today: భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోతున్న వేళ ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు గురువారం రోజు 10 శాతం పడిపోయాయి. ఇక్కడ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటుగా ఓలా రూ. 1000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కూడా కారణంగా తెలుస్తోంది. ఇక్కడ రైట్స్ ఇష్యూ ధరను మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా నిర్ణయించడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

Minor Demat AC: స్టాక్ మార్కెట్లో 28 రోజుల పాప పెట్టుబడులు.. మైనర్లకు డీమ్యాట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?

0
Minor Demat Account: స్టాక్ మార్కెట్లోకి 28 రోజుల పాప ఎంట్రీ ఇచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ జెరోధా వ్యవస్థపకుడు నితిన్ కామత్ మైనర్ అకౌంట్‌ వివరాలు వెల్లడించడమే ఇందుకు కారణం. అయితే మరి మైనర్ల పేరుపై డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడం ఎలా, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సూపర్ డూపర్ ఎల్‌ నినో తీవ్రతరం.. భూగోళం మొత్తం దాదాపు పూర్తి ఎరుపులోకి ..!

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే దీని ప్రభావంతో భారత్‌ సహా దక్షిణాసియాలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఇటీవల ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తాజాగా, అంతర్జాతీయ వాతావరణ నిపుణులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. సూపర్ ఎల్ నినో దెబ్బకు భూగోళం మొత్తం ఎరుపుగా మారిపోయిందని మ్యాప్‌ను షేర్ చేశారు.

విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలంటే రూ. 67 లక్షలు చెల్లించాలంటూ..!

అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా పొందే తాత్కాలిక ఉద్యోగ అనుమతులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 70 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.67 లక్షలు) ఫీజు విధించేందుకు సంచలన ప్రతిపాదనలు చేసింది. చౌక శ్రామిక శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని, స్థానిక అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.

చుట్టమల్లే సాంగ్‌లో జాన్వీ కపూర్ డీప్ ఫేక్ వీడియో.. సజ్జనార్ ఫోటోను వదల్లేదు.. జూనియర్ NTRకు సీపీ ట్వీట్

0
చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్‌ వీడియో వివాదంలో మరో నకిలీ ప్రచారం వెలుగులోకి వచ్చింది. పాటను అసభ్యంగా ఎడిట్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ కాగా.. అందులో సీపీ సజ్జనార్‌ ఫొటోతో ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఉపయోగించారు. ఈ విషయంపై స్పందించిన సజ్జనార్‌ అది నిజమైన ఫొటో కాదని, డీప్‌ఫేక్‌ అని స్పష్టం చేశారు. నిజాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి కంటెంట్‌ను షేర్‌ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. తన ఫొటోను కొందరు అభిమానులు దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గమనించాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ విజ్ఞప్తి చేశారు.

జూరాల రైతులపై కేసులు.. హరీశ్‌రావు ఫైర్, ‘ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన’!

0
జూరాల కాలువకు నీటిని విడుదల చేసుకున్న 14 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టగా.. అధికారులు స్పందించకపోవడంతో కొందరు రైతులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరిగేషన్‌ డీఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రైతులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని విమర్శిస్తూ.. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Telangana News, October 8 Live: కూతుర్ని హుస్సేన్ సాగర్లోకి తోసేసిన తల్లి.. కాపాడిన ఆటో డ్రైవర్

0
Telangana Breaking News Today: తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను చూడండి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల సమాచారం, పొలిటికల్ అప్డేట్స్ కూడా ఇందులో మీరు చూడొచ్చు.