HomeTELANGANAజూరాల రైతులపై కేసులు.. హరీశ్‌రావు ఫైర్, ‘ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన’!

జూరాల రైతులపై కేసులు.. హరీశ్‌రావు ఫైర్, ‘ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన’!

జూరాల కాలువకు నీటిని విడుదల చేసుకున్న 14 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టగా.. అధికారులు స్పందించకపోవడంతో కొందరు రైతులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరిగేషన్‌ డీఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రైతులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని విమర్శిస్తూ.. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments