SBI DLC: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాధి మంది పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ బ్యాంక్ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి పెన్షన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందవచ్చని తెలిపింది. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపింది. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఇంట్లో నుంచే పూర్తి చేసేందుకు ఏం చేయాలి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


