Home Blog Page 12

Guru Nakshatra Gochar 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడి సంచారంతో ఈ 4 రాశులపై ఎలాంటి ప్రభావం?

Guru Nakshatra Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై శుభ, అశుభ ప్రభావాలు పడతాయి. ఈ నేపథ్యంలో 08 ఆగస్టు 2026 గురువారం నాడు గురుడు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు దశలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై విభిన్న ప్రభావాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్నిరాశుల వారికి అనేక రంగాల్లో సవాళ్లు ఎదురుకావొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో పెట్టుబడి పెట్టడం వంటి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాదు ఎవ్వరికీ తొందరపడి అప్పులు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సందర్భంగా గురు గ్రహం నక్షత్ర మార్పు సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

4 ఏళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. అసలు సీక్రెట్ బయటపెట్టిన టీమిండియా కోచ్!

0
భారత టీ20 జట్టులోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ స్పందించారు. ఆర్సీబీని వరుసగా 2025, 2026 ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడంలో 45 వికెట్లతో భువీ కీలక పాత్ర పోషించాడని తెలిపారు. యువ బౌలర్లతో కూడిన జట్టుకు న్యూజిలాండ్ పర్యటనలో అనుభవం ఎంతో అవసరమని సెలెక్టర్లు భావించి ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే మహమ్మద్ షమీ పునరాగమనం, లక్ష్మణ్-గంభీర్‌ల సమన్వయంపై కూడా ఆయన మాట్లాడారు.

“నన్ను రిస్క్ టేకర్ అనుకుంటారు.. కానీ అసలు నిజం వేరు”: ట్రావిస్ హెడ్!

0
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన మైండ్‌సెట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగించాడు. మైదానంలో ధనాధన్ హిట్టింగ్ చేసే హెడ్, కేవలం వినోదం కోసం ఆడతాడని, రిస్క్ టేకర్ అని భావించడం పొరపాటని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా ప్రత్యర్థి బౌలర్ల రికార్డులు, వీడియోలు విశ్లేషించుకుంటానని వివరిస్తూ, తన విజయం వెనుక పక్కా మైండ్ గేమ్, కఠిన శ్రమ ఉన్నాయని వెల్లడించాడు.

ఐపీఎల్ vs పీఎస్ఎల్ బిగ్ ఫైట్.. 2027 సీజన్ విండో ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు!

0
2027 పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 12) షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖరారు చేసింది. 2027 మార్చి 18 నుంచి మే 2 వరకు 8 జట్లతో ఈ టోర్నీ జరగనుంది. అయితే అదే సమయంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2027) కూడా జరగనుండటంతో రెండు లీగ్‌ల మధ్య మరోసారి తేదీల క్లాష్ జరగనుంది. అయితే ఐపీఎల్‌తో పోలిస్తే.. పీఎస్ఎల్ స్థాయి చాలా తక్కువ అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌‌ను దాటి విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌లో ఆడతారా.. అనేది అనుమానమే.

ఇండియాకు రియల్ బాస్ అంబానీయేనా? ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ అదిరిపోయే పంచ్

0
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న స్టార్‌లింక్.. భారత్‌లో కూడా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ లింక్ ఎంట్రీని భారత్‌లోకి కొందరు అడ్డుకుంటున్నారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆరోపించారు. అంతేకాదు, నేరుగా ఆయన అంబానీనే టార్గెట్ చేయడం గమనార్హం. భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా? అంటూ మస్క్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు.

సౌదీ విమానాశ్రయంపై హౌతీల దాడులు.. రియాద్‌కు సర్వీసులు నిలిపివేసిన భారతీయ ఎయిర్‌లైన్స్

0
పశ్చిమాసియాలో మరో యుద్ధం ముంచుకొస్తోంది. సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పరస్పర దాడులతో ఉద్రికత్తలు నెలకున్నాయి. గురువారం తెల్లవారుజామున సౌదీ చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు, పోర్టులే లక్ష్యంగా హౌతీలు విరుచుకుపడ్డారు. దీంతో రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు సౌదీకి భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్ చెల్లిస్తున్నట్టు తెలిపాయి.

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,261 స్పెషల్ బస్సులు.. ఏ సిటీకి ఎన్ని సర్వీసులంటే..!

ఏపీఎస్ ఆర్టీసీ దసరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 5 వేలకు పైగా స్పెషల్ బస్సులను వేసింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి పెద్ద ఎత్తున ఈ బస్సు సర్వీసులను నడపనుంది. అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు కూడా ఉండవు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీకి గోల్డ్ మెడల్.. గవర్నర్ చేతుల మీదుగా సత్కారం

రాజమండ్రి జైల్లో ఉన్న ఎన్‌.సురేశ్ అనే వ్యక్తి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతోపాటు గోల్డ్‌ మెడల్‌ని కూడా సాధించాడు. తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సురేశ్ ఈ పతకాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవం ఒక అరుదైన ఘట్టానికి వేదికైంది. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ వి. సన్యాసిరావు హర్షం వ్యక్తం చేశారు. ఇది మిగతా ఖైదీలకు కూడా మంచి మోటివేషన్ అవుతుందని అన్నారు.

అక్కల మధ్య ఆస్తి తగాదా.. ఆగిన అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియలు

అగ్గిపెట్టె మచ్చ మరణం నుంచి ఇంకా నెటిజన్లు కోలుకోలేదు. అంతలోనే మరో దారుణ వార్త అందరిని కలచి వేస్తుంది. అక్కల మధ్య ఆస్తి తగాదాలతో మచ్చ అంత్యక్రియలు ఆగిపోయాయి. అగ్గిపెట్టి మచ్చ తండ్రి పేరుతో ఉన్న ఇల్లు విషయంలో వాటాలు దగ్గర వివాదం తలెత్తింది. నిజానికి ఈ ఇల్లును అతడి ఇద్దరు అక్కలు పంచుకోవాలి. కానీ మచ్చ చనిపోయాడు కాబట్టి.. ఇద్దరం సరిసమానంగా పంచుకుందామని పెద్దక్క అంటుంటే.. అలా కుదరదు మూడు వాటాలు వేయాల్సిందేనని చిన్నక్క పట్టుబడుతోంది. ఈ వాటా తేలేక వరకు పెద్దల్లో పంచాయతీ నడుస్తోందట, ఆ పంచాయతీ తేలాక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటాపై.. మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అన్నారు. అలాగే బీసీల రిజర్వేషన్ల అంశంపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాగా 34 శాతం బీసీ రిజర్వేషన్ అంశం కొత్తదేమి కాదు.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేవి. కాకపోతే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు వల్ల గత ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 34 నుంచి 24కు తగ్గించింది.