నోబెల్ బహుమతి అందుకోవడం ప్రపంచ శాస్త్రవేత్తలకు జీవితకాల కల. కానీ, ఈ పురస్కారం దక్కడం అంత ఈజీ కాదు. ఆరు రంగాల్లో చేసిన విశేష సేవలకు ఈ ప్రైజ్‌ను అందిస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ప్రెడ్ నోబెల్ గౌరవార్థం ఏటా స్వీడిష్ రాయల్ అకాడమీ, కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, నార్వేజియన్ నోబెల్ కమిటీ సంయుక్తంగా అందజేస్తాయి. అయితే, సైన్స్‌లో ఇచ్చి గణితంలో ఎందుకు నోబెల్ బహుమతి లేదు అనే సందేహాం తరుచూ వ్యక్తమవుతూనే ఉంటుంది.
నోబెల్ శాంతి బహుమతిపై ఉత్కంఠ.. రేసులో భారతీయుడు, ఈసారైనా ట్రంప్ కల నెరవేరుతుందా?
ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన బహుమతులైన నోబెల్ పురస్కారాల పండగ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న శాంతి బహుమతిని మరికొద్ది గంటల్లో ప్రకటించనున్నారు. ఈసారి మొత్తం 287 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 208 మంది వ్యక్తులు ఉన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కూడా శాంతి బహుమతి తనకే ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నో యుద్ధాలు ఆపిన నాకు అవార్డు ఇవ్వకపోతే నోబెల్‌కే అవమానం అంటున్నారు.
జీఎస్టీతో ఏటా రూ.800 కోట్లకుపైగా తెలంగాణ ఆదాయంపై ప్రభావం.. సంస్కరణలపై భట్టి రియాక్షన్
జీఎస్టీ, అందులో తీసుకువస్తున్న సంస్కరణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ వాహనాలకు సంబంధించిన మార్పుల వల్ల తెలంగాణకు ఏటా సుమారు రూ.800 కోట్ల ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, బోగస్ ఇన్వాయిస్‌లు, పన్ను మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆదాయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జీఎస్‌టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భట్టి ప్రతిపాదించారు.
తెలంగాణలో కొత్త ఓటు కోసం భారీగా దరఖాస్తులు.. 4.88 లక్షల అప్లికేషన్లు, విదేశాల నుంచి ఓటు నమోదు
తెలంగాణలో ఎస్ఐఆర్ కీలక దశకు చేరుకుంది. యువ ఓటర్లు, కొత్తగా అర్హత పొందిన పౌరులతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు అడ్రస్ మార్పులు, పేర్లు, ఇతర వివరాల సవరణ కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు నమోదయ్యాయి. ఓటర్ల పేర్ల తొలగింపుపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి కొత్త ఓటు నమోదుకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య ప్రత్యేకంగా గణనీయంగా ఉంది. అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.
ఈనెల 14న రామగుండంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేటీఆర్
సింగరేణి కార్మికుల సమస్యలను రాజకీయ వేదికపై ప్రధానంగా ప్రస్తావించేందుకు బీఆర్‌ఎస్ కార్యాచరణకు సిద్ధమైంది. లాభాల్లో కార్మికుల వాటా, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డులు, గుర్తింపు యూనియన్ ఎన్నికలు, పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి అంశాలను సభలో ప్రధానంగా లేవనెత్తనుంది. కార్మికుల ఇళ్ల హక్కులు, సింగరేణి భవిష్యత్తు, సంస్థ పనితీరుపైనా చర్చకు అవకాశం ఉంది. బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై హరీశ్‌రావు చేసిన ఆరోపణలకు సభ వేదికగా మరింత వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 14న రామగుండంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతుండటంతో సింగరేణి ప్రాంత రాజకీయాల్లో సభకు ప్రాధాన్యం ఏర్పడింది.
హైదరాబాద్ నగరవాసులకు RTC శుభవార్త.. బస్సు ఛార్జీలు 40 శాతం తగ్గింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పుష్పక్ బస్సుల్లో టికెట్ ధరలను భారీగా తగ్గించింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం మరింత అందుబాటులోకి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు క్యాబ్, ఇతర ప్రైవేట్ రవాణాతో పోలిస్తే ప్రజా రవాణాను ఎంచుకునే వారికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కొత్త ధరలు అమల్లోకి రావడంతో ప్రయాణికులు వీటిని తెలుసుకుని ప్రయాణించాలని ఆర్టీసీ పేర్కొంది.
UAEలో తెలంగాణ యువతులకు ఉద్యోగాలు.. ప్రయాణం, వీసా, వసతి, ఇన్సూరెన్స్ అన్ని ప్రయోజనాలు..!
విదేశాల్లో నర్సింగ్ రంగంలో ఉద్యోగం కోరుకునే మహిళలకు టామ్‌కామ్ యూఏఈలో ఉద్యోగ అవకాశం కల్పించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్, క్లినికల్ సామర్థ్యాలు, భాషా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2 సంవత్సరాల ఉద్యోగ కాలంతో పాటు ప్రయాణం, నివాసం, బీమా వంటి సదుపాయాలు ఉండటం ఈ అవకాశంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్‌ను పంపడంతో పాటు సంస్థను నేరుగా సంప్రదించి నియామకానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
రాశిఫలాలు 09 అక్టోబర్ 2026: బ్రహ్మ యోగం మేషం నుంచి మీనం వరకు ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
రాశిఫలాలు 09 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు బ్రహ్మ, ఇంద్ర యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున కన్యా రాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడి కలయిక జరగనుంది. శుక్రుడు తులా రాశిలో మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల వేళ మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
Unlucky Zodiac Signs: అక్టోబర్ 9 నుంచి షడాష్టక యోగం, ఈ 4 రాశుల వారు ఎదుర్కొనే సవాళ్లేంటి?
Unlucky Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అక్టోబర్ 9న శుక్రవారం రోజున బుధుడు, శని గ్రహాల మధ్య షడాష్టక యోగం ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి సుమారు 150 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు షడాష్టక యోగం ఏర్పడనుంది. నవరాత్రులకు ముందు ఏర్పడే ఈ యోగాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఆర్థిక పరంగా, ఉద్యోగం, వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈసారి, షడాష్టక యోగం ప్రభావం కొన్నినిర్దిష్ట రాశుల వారిపై ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈ సందర్భంగా ఏ రాశుల వారు సవాళ్లను ఎదుర్కొంటారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

