Vijay Deverakonda Speech: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, నెగెటివిటీపై స్పందించారు. తన ఆత్మవిశ్వాసాన్ని బలుపుగా భావించినా తాను తగ్గనని, మారాల్సింది తాను కాదని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ ఇది తన కెరీర్‌లోనే పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెగెటివ్ ప్రచారం వెనుక గ్రూపులు పనిచేస్తున్నాయని, ఇలాంటి ట్రోలింగ్‌ను ద్వేషంగా భావించాల్సిన అవసరం లేదని విజయ్ తెలిపారు.
‘విజయ్ దేవరకొండపై నెగిటివిటీ ఎందుకు?.. ఈ అబ్బాయి చాలా మంచోడు’.. ట్రోల్స్‌పై ‘రణబాలి’ నిర్మాత రవి శంకర్
‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవి శంకర్ మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. విజయ్ చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని, ఆయన పడే కష్టాన్ని మెచ్చుకోవాలే తప్ప, కావాలని నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరారు. విజయ్‌ను పాజిటివ్ మైండ్‌సెట్‌తో చూడాలని అన్నారు. అక్టోబర్ 16న రానున్న ‘రణబాలి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.
Ranabaali Trailer: విజయ్ దేవరకొండ విశ్వరూపం.. ‘రణబాలి’ ట్రైలర్ వచ్చేసింది!
Ranabaali Movie Trailer: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 3 నిమిషాల 47 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్‌లో శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించారు. ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
కళ్ళద్దాలపై గీతలు పడకుండా ఎలా మెంటెయిన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలో తెలుసా
కళ్లద్దాలు వాడినప్పుడు వాటిని సరిగ్గా క్లీన్ చేయడం తెలియాలి. లేదంటే గ్లాసెస్‌పై మరకలు పడి మబ్బుగా కనిపించడం, విజన్ సరిగ్గా లేకపోవడం, దీంతో తలనొప్పి పెరగడం వంటి ఎన్నో సమస్యలొస్తాయి. కళ్లద్దాల్ని క్లీన్ చేయడానికి ప్రతీసారి ఐ కేర్‌కి మాత్రమే వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనూ కొన్ని కిటుకులు ఫాలో అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మరకలు ఉండవు కూడా. క్లీన్ చేయడం అంటే కళ్లద్దాలతో వచ్చిన క్లాత్‌తో తుడవడం, మెత్తని దుస్తులతో క్లీన్ చేస్తే చాలనుకుంటారు. కానీ, ఏ మాత్రం కాదు. అసలు సరిగ్గా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూడండి.
Flight Ticket: మొన్న ఇండిగో.. నేడు ఎయిరిండియా, ఆకాశ ఎయిర్.. విమాన టికెట్ ధరలు పెంపు.. అక్టోబర్ 9 నుంచే అమలులోకి!
Flight Ticket: విమాన ప్రయాణికులకు ధరల షాక్ తగులుతోంది. ఇటీవలే ఇండిగో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయెల్ సర్ ఛార్జీలను పెంచిగా ఇప్పుడు ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ విమాన సంస్థలు సైతం అదే దారిలో నడుస్తున్నాయి. టికెట్లపై ఫ్యూయల్ సర్ ఛార్జీలను విధిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. పెంచిన ధరలను అక్టోబర్ 9వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నట్లు చెప్పాయి. మరి ఏ కంపెనీ ఎంత మేర పెంచుతుంది అనేది తెలుసుకుందాం.
ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్.. అధికారుల అరెస్ట్ పవర్ రద్దు, ప్యాసిక్యూషన్ లిమిట్ 5 కోట్లకు పెంపు.. GST కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు!
57th GST Council Meeting: వస్తు సేవల పన్ను జీఎస్టీ మండలి 57వ సమావేశం గురువారం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను అధికారుల అరెస్ట పవర్‌ను తొలగించారు. అలాగే వ్యాపారులపై ప్రాసిక్యూషన్ చేసే పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. జీఎస్టీ రేట్ల సవరణలు చేయలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న నేతృత్వంలో జరిగిన మండలి సమావేశంలోని కీలక విషయాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
Multibagger: రూ.102 నుంచి రూ.1005కు స్టాక్.. 9 నెలల్లో 880 శాతం జంప్.. లక్షకు రూ.9.80 లక్షలు, మోతీలాల్ ఓస్వాల్ భారీ పెట్టుబడులు!
Multibagger: దేశీయ స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ ఊహించని విధంగా రిటర్న్స్ ఇస్తుంటాయి. అదే క్రమంలో టెక్నాలజీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ స్టాక్ అద్భుతం చేసింది. ఈ 2026లో గడిచిన 9 నెలల కాలంలోనే ఏకంగా 880 శాతం ర్యాలీ చేసింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.9.80 లక్షలు అందించింది. మోతీలాల్ ఓస్వాల్, బంధన్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఈ స్టాక్స్ భారీగా కొనుగోలు చేశాయి. మరి ఈ స్టాక్ ర్యాలీకి గల కారణాలు తెలుసుకుందాం.
ఆత్మీయులకు బాసట, ఆవేదనల ప్రతిరూపం.. నోబెల్ సాహిత్యం 2026 విజేత ‘నాక్స్’ కథ.. భారత్‌తో లింక్
సాహిత్యంలో విశేష సేవలకు గానూ కెనడా రచయిత్రి అన్నే కార్సన్‌కు ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. తన సృజనాత్మక రచనలతో సమకాలీన సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆమె… 20పైగా పుస్తకాలను రాశారు. ఆమె రచనల్లో నాక్స్ అనే పుస్తకం గురించి నోబెల్ కమిటీ ప్రస్తావించింది. ఈ పుస్తకంలో మరణించిన తన సోదరుడి జ్ఞాపకార్థం ఈ పుస్తకాన్ని రాశారు. డ్రగ్స్ కేసులో తప్పించుకోడానికి కెనడా నుంచి పారిపోయిన వచ్చిన అతడు సుదీర్ఘకాలం భారత్‌లో గడిపాడు.
గణితంలో నోబెల్ ప్రైజ్ ఎందుకు లేదు? భార్య చేసిన పనితోనే ఆల్ఫ్రెడ్ నోబెల్ కక్షగట్టాడా? ఇందులో నిజమెంత?
నోబెల్ బహుమతి అందుకోవడం ప్రపంచ శాస్త్రవేత్తలకు జీవితకాల కల. కానీ, ఈ పురస్కారం దక్కడం అంత ఈజీ కాదు. ఆరు రంగాల్లో చేసిన విశేష సేవలకు ఈ ప్రైజ్‌ను అందిస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ప్రెడ్ నోబెల్ గౌరవార్థం ఏటా స్వీడిష్ రాయల్ అకాడమీ, కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, నార్వేజియన్ నోబెల్ కమిటీ సంయుక్తంగా అందజేస్తాయి. అయితే, సైన్స్‌లో ఇచ్చి గణితంలో ఎందుకు నోబెల్ బహుమతి లేదు అనే సందేహాం తరుచూ వ్యక్తమవుతూనే ఉంటుంది.
నోబెల్ శాంతి బహుమతిపై ఉత్కంఠ.. రేసులో భారతీయుడు, ఈసారైనా ట్రంప్ కల నెరవేరుతుందా?
ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన బహుమతులైన నోబెల్ పురస్కారాల పండగ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న శాంతి బహుమతిని మరికొద్ది గంటల్లో ప్రకటించనున్నారు. ఈసారి మొత్తం 287 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 208 మంది వ్యక్తులు ఉన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కూడా శాంతి బహుమతి తనకే ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నో యుద్ధాలు ఆపిన నాకు అవార్డు ఇవ్వకపోతే నోబెల్‌కే అవమానం అంటున్నారు.

