2027 పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 12) షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖరారు చేసింది. 2027 మార్చి 18 నుంచి మే 2 వరకు 8 జట్లతో ఈ టోర్నీ జరగనుంది. అయితే అదే సమయంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2027) కూడా జరగనుండటంతో రెండు లీగ్‌ల మధ్య మరోసారి తేదీల క్లాష్ జరగనుంది. అయితే ఐపీఎల్‌తో పోలిస్తే.. పీఎస్ఎల్ స్థాయి చాలా తక్కువ అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను దాటి విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్లో ఆడతారా.. అనేది అనుమానమే.


