పశ్చిమాసియాలో మరో యుద్ధం ముంచుకొస్తోంది. సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పరస్పర దాడులతో ఉద్రికత్తలు నెలకున్నాయి. గురువారం తెల్లవారుజామున సౌదీ చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు, పోర్టులే లక్ష్యంగా హౌతీలు విరుచుకుపడ్డారు. దీంతో రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు సౌదీకి భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్ చెల్లిస్తున్నట్టు తెలిపాయి.


