Flydubai Flight Suspect Hamam Al Hamami Images: ఫ్లైదుబాయ్ విమానంలో ఘటనకు సంబంధించి మరికొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి. భాతర పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ హమామ్ అల్‌హమామీకి ఉగ్రవాద భావజాలం ఉందని.. అందుకే అతడిపై గతంలో విమానాలు నడపకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అతడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అతడి లింక్డ్‌ఇన్ అకౌంట్‌ను కూడా గుర్తించారు.. అందులో రెండు పోస్టులు ఉన్నాయి.
భూ సమస్య పరిష్కారం కాలేదని.. MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య
భూ సమస్య పరిష్కారం కాలేదని.. ఓ రైతు ఎమ్మార్వో ఆఫీసు వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర విరక్తి చెందిన ఆ రైతు.. తహసీల్దార్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశపారంపర్యంగా తన కుటుంబానికి 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా.. 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నాయని.. మరో ఎకరం పొరుగు రైతుల భూమిలో ఉందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతగిరి ఘాట్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురు మహిళలు మృతి, సీఎం దిగ్భ్రాంతి
అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుమారు 50-54 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. అనంతగిరి కొండపై నుంచి కిందికి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పిల్లల సైబర్ భద్రతకు సమగ్ర ఫ్రేమ్‌వర్క్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన NALSA దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, ప్రత్యేక కోర్టులు, సైబర్ ల్యాబ్‌లను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేయాలని, సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్లను గుర్తుంచుకోవాలని కోరారు.
Telangana NFHS 6 Survey: తెలంగాణలో మద్యం వినియోగం.. హైదరాబాద్‌లో 30.4 శాతమే, గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం
Telangana Alcohol Consumption: తెలంగాణలో మద్యం వినియోగంపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వే తెలిపింది. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 33 జిల్లాల్లో 31వ స్థానంలో నిలిచింది. ఇక్కడ పురుషుల మద్యం వినియోగం 30.4 శాతంగా నమోదైంది. జనగాంలో అత్యధికంగా 61.6 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పట్టణాల కంటే ఎక్కువగా ఉంది. మద్యం వినియోగాన్ని శాతం ఆధారంగా మాత్రమే NFHS-6 లెక్కించింది.
Jurala Project Green Water: ఆకుపచ్చ రంగులోకి జూరాల నీళ్లు.. చేపలు మృత్యువాత, ఇదే కారణమా..?
Jurala Project Fish Deaths: పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నీరు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం కలకలం రేపుతోంది. వారం రోజులుగా నీటి రంగులో మార్పుతోపాటు దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. చేపలు మృత్యువాత పడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన కర్ణాటకలోని పరిశ్రమల వ్యర్థాల వల్లే నీరు కలుషితమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వినాయక నిమజ్జనాల వల్ల కూడా రంగు మారి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపి కారణాన్ని తేల్చనున్నారు.
Venus Combust 2026: తులా రాశిలో శుక్రుడి అస్తమయం వేళ మేషం సహా ఈ 5 రాశులకు ధన లాభ అవకాశాలు
Venus Combust 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడిని రాక్షసులకు గురువుగా భావిస్తారు. అయితే సందప, శ్రేయస్సుకు శుక్రుడిని ప్రతీకగా పరిగణిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శుక్రుడు అక్టోబర్ 14న అర్ధరాత్రి 12 గంటలకు తన అసలు త్రికోణ రాశి అయిన తులా రాశిలో అస్తమించనున్నాడు. మళ్లీ తిరిగి అక్టోబర్ 28న ఉదయించనున్నాడు. అంటే దాదాపు రెండు వారాల పాటు అంటే 14 రోజులు అస్తమయ స్థితిలోనే ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా శుక్రుడి అస్తమయం కారణంగా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Lucky Zodiac Signs: వచ్చే వారం నవపంచమ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 6 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం
Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారం చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత కన్య, తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు తులా రాశిలో బుధుడు, శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు. మరోవైపు కుంభరాశిలో రాహువు, శని మీన రాశిలో, కేతువు సింహ రాశిలో, గురుడు, కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల స్థానాల కారణంగా వృషభరాశి సహా ఈ 4 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఏర్పడే కళాత్మక, నవపంచమ యోగాల వేళ మేషం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
ఏషియన్ గేమ్స్‌లో మళ్లీ మనదే గోల్డ్.. ఫైనల్‌లో పాకిస్థాన్ చిత్తు..!
ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51*) మెరుపులతో 211/6 భారీ స్కోరు చేసింది. అనంతరం పాక్‌ను 192/6కు పరిమితం చేసింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియాడ్‌లో స్వర్ణాన్ని నిలబెట్టుకుంది.
దాయాదిపై విరుచుకుపడ్డ అభిషేక్, తిలక్.. ఫైనల్‌లో భారత్ రికార్డు స్కోరు..!
ఏషియన్ గేమ్స్ 2026 గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు పాకిస్థాన్‌పై సిక్సర్ల సునామీ సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్దేశిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61 – 7 సిక్సర్లు) భారీ స్కోరుకు బాటలు వేయగా.. హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ (22 బంతుల్లో 51*) మెరుపు అర్ధశతకంతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంటుంది.

