భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల చాహల్ రెడ్ బాల్ మ్యాచ్‌లకు వీడ్కోలు చెప్పినా, పరిమిత ఓవర్ల (వైట్ బాల్) క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాలనే కల నెరవేరలేదని, అయినా తన ప్రయాణం పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. లార్డ్స్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్ అతనికి ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌గా నిలిచింది.
దేశవ్యాప్తంగా నిరసనలకు ఒకే వేదిక.. సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ప్రజలకు విజ్ఞప్తి
‘సత్యాగ్రహ’ పేరుతో రాహుల్ గాంధీ కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజలు చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ఉద్దేశమని తెలిపారు. భూమి, మహిళల హక్కులు, దళితులు, ఓబీసీలు, విద్య, పరీక్షలు వంటి అంశాలపై జరుగుతున్న ఉద్యమాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ సమస్యలపై పోరాడుతున్న ప్రజలు వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేతగా అవసరమైన చోట అండగా నిలుస్తానని పేర్కొన్నారు.
సూట్‌కేస్ భామ, పల్టీ భామ అంటూ సత్యభామపై ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు.. మండిపడ్డ టీవీకే
ధారాపురం ఉపఎన్నికల ప్రచారం వేళ ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. టీవీకే అభ్యర్థి సత్యభామను ‘సూట్‌కేస్ భామ’, ‘పల్టీ భామ’ అంటూ ప్రస్తావించిన స్టాలిన్.. ఆమె శరీరాకృతిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీకే నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహిళను అవమానించేలా స్టాలిన్ మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయంలో స్టాలిన్ క్షమాపణ చెప్పాలని పలువురు టీవీకే నేతలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సత్యభామ గతంలో ఏఐఏడీఎంకే తరఫున గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయం ఉపఎన్నికలకు కారణమైంది.
త్వరలో ఏపీ ఎన్నికల గుట్టు విప్పుతా.. స్టడీ చేస్తున్నా.. 2 వారాల్లో వస్తా : ప్రకాశ్ రాజ్ సంచలనం
ఓటర్ల జాబితా ప్రక్రియపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియపై ఆయన హైదరాబాద్‌లోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై రీసెర్చ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. దాని గురించి రెండు వారాల్లో మాట్లాడతానని అన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే, బీజేపీ కూటమి పార్టనర్స్ ఏమి చేస్తున్నారని క్వశ్చన్ చేశారు.
పురిటి నొప్పులు భరిస్తూ.. 8 కిలో మీటర్లు డోలీలో గర్భిణీ నరకయాతన..!
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. అమ్మవారి ధారకొండ పంచాయతీ తడకపల్లి గ్రామానికి చెందిన కొర్రా మంగరాజు భార్య డామిని (27) నిండు గర్భిణిని వారి కుటుంబ సభ్యులు డోలీలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలించారు. ఆ డోలీలో ఆమె 8 కిలోమీటర్ల పాటు నొప్పులను భరిస్తూనే ఉంది. శ్యామగెడ్డకు చేరుకున్న తర్వాత అక్కడ జీపులో చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ ఆడపిల్లకి ఆమె జన్మనిచ్చింది. ఈ ఘటన ఎంతోమందిని కలచివేస్తుంది.
బొత్సను కూడా ఇలాగే సస్పెండ్ చేస్తారా.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సవాల్
Baddukonda Appalanaidu Comments Ys Jagan Mohan Reddy: విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ అప్పలనాయుడు అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ తీరుపై అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జి శ్రీను వియ్యంకుడినని తనను సస్పెండ్ చేశారని.. బొత్స కూడా శ్రీనుకు బంధువని, కాబట్టి ఆయన్ను కూడా సస్పెండ్ చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tirupati: శ్రీసిటీలోని పరిశ్రమలో పేలుడు.. నలుగురు కార్మికుల మృతి
Tirupati Sri City Boiler Blast Four Died: తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ఒక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తరలించారు. మృతుల్లో.. తమిళనాడుకు చెందిన ఇద్దరు కార్మికులు, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకరు, ఏపీకి చెందిన ఒకరు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మతం మారితేనే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తా.. హైదరాబాద్ యువకుడ్ని అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు
Tirupati Police Arrested Hyderabad Student For Marriage Fraud: పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన హైదరాబాద్ యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు జార్జియాలోొ ఎంబీబీఎస్ చదవగా ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని అడిగితే.. ఆ యువకుడు ఆమెను మతం మారాలన్నాడు. లేకపోతే ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు హైదరాబాాద్ వెళ్లి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
నా మనవడు చిన్ని చేతుల మీదుగా విరాళం ఇవ్వడం నా అదృష్టం.. విలువలో చిన్నదైనా సరే: నాగబాబు
Mlc Nagababu Donated Rs 1 Lakh To Tirumala Anna Prasadam: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ నాగబాబు తన భార్య పద్మజ, కుమార్తె నిహారిక, కొడుకు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళం అందించినట్లు నాగబాబు ట్వీట్ చేశారు. తన మనవడి చేతుల మీదుగా విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

