TTD Tirumala Srivani Current Booking Closed On Saturday Sunday: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. టీటీడీ రెండు రోజుల పాటూ శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేసింది. శనివారం, ఆదివారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ అందుబాటులో ఉండదని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతిలో గ్రామకంఠాలు.. మినహాయింపులు పునఃపరిశీలన.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు
AP Cm Chandrababu On Amaravati Grama Kantams: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని గ్రామాల్లో 2014-19 మధ్య ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులు పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నారాయణణు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు గ్రామకంఠాలను మరోసారి పరిశీలించనున్నారు. 2014-2019 మధ్య కొందరికి నిబంధనలకు విరుద్ధంగా మినహాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వీటిని మరోసారి పరిశీలించాలని సూచించారు. అలాగే అమరావతిలో రైతులక రిటర్నబుల్ ప్లాట్లను కూడా పంపిణీ చేస్తున్నారు.
తిరుమలలో బైక్ రైడ్స్‌కు నో ఎంట్రీ?.. ఆ యాప్‌లలో తిరుమల ఆప్షన్ కనిపించకుండా ఉండేలా ఆలోచన?
Tirumala Bike Rides Ban Soon: హైదరాబాద్‌కు చెందిన సునీల్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత గత నెల 26వ తేదీన తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. తిరుమల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో.. తిరుమల మొదటిఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా బైక్ క్యాష్‌బారియన్‌ను ఢీకొనడంతో రాపిడో రైడర్ అక్కడే చనిపోయారు. ఈ ఘటనలో సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో టీటీడీ ప్రైవేట్ యాప్‌ల ద్వారా బైక్ రైడ్‌లను నిషేధించాలని ఆలోచన చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు.. అన్ని ఆలయాల్లో మొదటి స్థానం
Swachh Award For Tirumala Temple: విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందించారు. ఆలయాల కేటగిరీలో తిరుమల శ్రీవారి ఆలయానికి మొదటి స్థానం దక్కింది. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయం, సింహాచలం ఆలయానికి ఆ తర్వాత స్థానంలో అవార్డులు దక్కాయి. ఇటు టీటీడీ పరిధిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి కూడా ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026 వచ్చింది.
Dhanush OM: ధనుష్ – మమ్ముట్టి ‘ఓం: చాప్టర్-1’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓం: చాప్టర్-1’. దసరా కానుకగా అక్టోబర్ 16న రావాల్సిన ఈ చిత్రం.. రజనీకాంత్ ‘జైలర్ 2’ పోటీ కారణంగా వాయిదా పడింది. తాజాగా న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Tollywood: తెలుగు తెరపై మితిమీరుతున్న హింస.. రక్తం ఏరులై పారితేనే కాసులు కురుస్తాయా?
ఒకప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్, క్లీన్ కామెడీతో ఆకట్టుకున్న ‘తెలుగు సినిమా’.. ఇప్పుడు పాన్ ఇండియా కలెక్షన్ల కోసం వైలెన్స్ వైపు మొగ్గుచూపుతోంది. కథల్లో బలం తగ్గి.. హింస, రక్తపాతం పెరుగుతోంది. ‘A’ సర్టిఫికేట్ కోసం ఆరాటపడుతోంది. ‘మా సినిమా పెద్దలకు మాత్రమే, పిల్లలు దూరంగా ఉండండి’ అని ఫిలిం మేకర్స్ గొప్పగా ప్రకటించుకుంటున్నారు. వైలెన్స్ ను గ్లోరిఫై చేస్తూ తెరపై రక్తాన్ని ఏరులై పారిస్తున్నారు. అహింసా మార్గాన్ని చాటిచెప్పిన గాంధీ జయంతి సందర్భంగా తెలుగు సినిమాలో పెరుగుతున్న హింసపై ఒక ప్రత్యేక విశ్లేషణ…
మలబద్ధకం తగ్గాలంటే మన ఊర్లో దొరికే మారేడు పండు + తిప్పతీగ కషాయం బెస్ట్ ఆప్షన్!
మలబద్ధకం సమస్య చిన్నదే అనిపించినా.. దాన్ని తరచూ నిర్లక్ష్యం చేస్తే రోజువారీ జీవితంలో ఇబ్బందులు పెరగవచ్చు. మలం గట్టిగా ఉండటం, మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి పెట్టాల్సి రావడం, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. దీర్ఘకాలంలో మలద్వారం చుట్టూ పగుళ్లు, పైల్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఆహారంలో పీచు పదార్థాలు తగ్గడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు మలబద్ధకానికి దారితీయవచ్చు.
అందుకే సమస్య మొదలైనప్పుడే రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం మంచిది. నీరు తగినంతగా తీసుకోవడం, ఆకుకూరలు వంటి ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మార్పులు సహాయపడవచ్చు. అంతేకాదు కొన్ని ఇంటి చిట్కాలు కూడా మలబద్ధకం సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.
Mutual Funds: రెండేళ్లలో సిప్ పెట్టుబడులపై లాభాలు, నష్టాలు ఇచ్చిన టాప్- 3 మిడ్‌క్యాప్ ఫండ్స్ లిస్ట్ ఇదే!
Midcap Fund Performance: మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా దీర్ఘకాలంలో ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంటాయని చెబుతుంటారు. అలా అని స్వల్పకాలంలో లాభాలు ఇవ్వవని కాదు కానీ మరీ అంత ఎక్కువ రాబడి ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు గత రెండేళ్ల కాలంలో మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో చూద్దాం. ఇక్కడ టాప్- 3 గెయినర్స్, టాప్- 3 లూజర్స్ ఏమేం ఉన్నాయో తెలుసుకుందాం.
ఐటీ స్టాక్స్‌కు బిగ్ బూస్ట్! అసెంచర్ రిజల్ట్స్‌తో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో షేర్లు సోమవారం దూసుకెళ్తాయా?
Accenture IAmpact on IT stocks: అమెరికా ఐటీ దిగ్గజం అసెంచర్ తాజాగా క్యూ4 ఫలితాల్ని ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంచనాల్ని మించి రాణించగా భారత ఐటీ షేర్లపైనా సానుకూల అంచనాలు పెరిగాయి. అమెరికా మార్కెట్లో ఇప్పటికే విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు పుంజుకున్నాయి. దీంతో సోమవారం సెషన్‌లో భారతీయ ప్రధాన ఐటీ స్టాక్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Hero Motors Share: 8 రోజుల్లోనే పెట్టుబడి డబుల్.. 105 శాతం లాభం.. దూసుకెళ్తోన్న హీరో మోటార్స్ షేరు
Hero Motors Share: హీరో మోటార్స్ షేరు దూసుకెళ్తోంది. మార్కెట్లోకి లిస్ట్ అయిన 8 రోజుల్లోనే పెట్టుబడులను రెండింతలు చేసింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర రూ.84 నుంచి రూ. 168 స్థాయికి చేరింది. కేవలం 8 రోజుల్లోనే 105 శాతం లాభాలను ఇచ్చి ఔరా అనిపించింది. బీఎండబ్ల్యూ, డుకాటీలకు పవర్‌ట్రైన్ ఉత్పత్తులు సరఫరా చేసే ఈ కంపెనీకి బల్క్ డీల్స్ కలిసివచ్చాయని చెప్పవచ్చు. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

