ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ప్రపంచ 4వ ర్యాంకర్ చైనాను 1-0తో ఓడించి, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాల్‌రెమ్‌సియామి తన 200వ మ్యాచ్‌లో నిర్ణయాత్మక గోల్ సాధించింది. పురుషుల టీమ్ కూడా శనివారం ఫైనల్లో మలేషియాతో తలపడనుంది. మరోవైపు బాక్సింగ్, రెజ్లింగ్‌లో గోల్డ్స్‌తో భారత్ పతకాల సంఖ్య 76కు చేరింది.
కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ రికార్డులు తక్కువేం కాదు భయ్యా, ఈ లెక్కలే సాక్ష్యం..! ఆరేళ్లు టైం వేస్ట్ కాకపోయి ఉంటే..?
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ.. 39 ఏళ్ల వయసులోనూ తన బ్యాట్‌కు పని చెబుతున్నాడు. 2012 వరకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసి.. నిలకడగా ఆడలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రోహిత్.. 2013లో ఓపెనర్‌గా మారిన తర్వాత అదరగొట్టే ఆటతీరు కనబర్చాడు. ఈ 14 ఏళ్ల కాలంలో వన్డేల్లో రోహిత్ శర్మ గణాంకాలు.. విరాట్ కోహ్లి గణంకాలకు దాదాపు చేరువగా ఉండటం గమనార్హం.
CJP SIR Protest ఢిల్లీ డీసీపీ ‘జనరల్ డయ్యర్’.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఘాటు వ్యాఖ్యలు
ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా దీనిపై ఉద్యమాన్ని గాంధీ జయంతి రోజున మొదలుపెట్టింది. ముంబయిలోని శివాజీ పార్కులో జరిగిన నిరసనలో అభిజీత్ దీప్కే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముంబయి పోలీసులు మంచోళ్లు అంటూనే ఢిల్లీ డీసీపీని బ్రిటిష్ జనరల్ డయ్యర్‌తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ మిషన్ శక్తితో అగ్రరాజ్యం షాక్.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా నిఘా మాజీ అధికారి
అంతరిక్షంలోనే ఉపగ్రహాలను కూల్చివేసే క్షిపణి టెక్నాలజీ కలిగిన ప్రపంచంలోని నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. భారత్ 2019లో అమెరికా, చైనా, రష్యాల సరసన చేరింది. అయితే, మార్చి 2019లో చేపట్టిన ఈ ప్రయోగం అగ్రరాజ్యం అమెరికాను కలవరానికి గురిచేసింది అని ఆ దేశ మాజీ నిఘా అధికారి తాజాగా వెల్లడించారు. ఆయన ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్ చేపట్టిన యాంటి శాటిలైట్ మిసైల్ పరీక్ష సమయంలో ఆందోళన చెందినట్టు తెలిపారు.
ఘటన గురించి తెలియగానే ‘మా బిడ్డను కాపాడమని దేవుడ్ని వేడుకున్నా’ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తండ్రి భావోద్వేగం
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోన్న విమానంలో కో-పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై పదునైన ఆయుధంతో దాడి చేయడం, ఆపై కూల్చివేయడానికి యత్నించాడు. కానీ, అతడి కుట్రలను కెప్టెన్ స్మిత్ భగ్నం చేశారు. తన తీవ్రంగా గాయపడినా మనో ధైర్యం కోల్పోలేదు. తన కోసం కాకుండా విమానంలోని 180 మంది ప్రాణాలు కోసం ఆలోచించారు. దీనిపై ఆయన తండ్రి భూపేంద్ర మచ్ఛార్ తాజాగా స్పందించారు. ఆయన తన కుమారుడి ధైర్యసాహసాలపై భావోద్వేగానికి గురయ్యారు.
ఉసురు తీసిన రాకాసి అల, విశాఖ బీచ్‌లో విహారయాత్రలో ఘోరం.. ఇంకా దొరకని రెండు మృతదేహాలు
విశాఖపట్నం తీరంలో విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో రుషికొండ ఐటీ హిల్స్ సమీపంలోని బీచ్‌కు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎగసిపడ్డ అలల ఉధృతికి ఈత కొడుతున్న సూర్యప్రకాశ్, నితీశ్, ప్రశాంత్ అనే ముగ్గురు విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. గల్లైంతన పిల్లల కోసం అధికారులు గాలింపు చేపట్టారు. ప్రశాంత్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బీచ్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఉచిత పథకాలు కాదు.. మౌలిక వసతులే ముఖ్యం: స్థానిక పోరులో ‘ఏకం’ పేరుతో కేకే సర్వే కిరణ్ పొలిటికల్ ఎంట్రీ
ఏపీ ఎన్నికల్లో తన సర్వేతో సంచలనం సృష్టించిన కిరణ్ కొండేటీ మరో సంచలన నిర్ణయంతో ముందుకొచ్చారు. ఏకం పేరుతో తన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోరులో అభ్యర్థుల్ని నిలబెట్టబోతున్నట్టు వెల్లడించారు. అంతే కాదు ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై సర్వే చేసినట్టు చెప్పారు. ప్రజలు ఉచిత పథకాలను కోరుకోవడం లేదని, మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగాలు, వసతులు కోరుకుంటున్నారని తన సర్వేలో తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా సమస్యల మీద పోరాడే ప్రతి అభ్యర్థికి తాను అండగా నిలబడతానని ఆయన అన్నారు.
మరోసారి వాతావరణ హెచ్చరిక: అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం
వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ వాతావరణానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అధికారులు చెప్పిన ప్రకారం అక్టోబర్ 12వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా బలపడనుంది. అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని సంబంధిత అధికారులు తెలియజేశారు.
రాయలసీమ పాలెగాళ్లే విజయ్ దేవరకొండ పాత్రకి స్ఫూర్తి.. ‘రణబాలి’ డాక్యుమెంటరీ మూడో ఎపిసోడ్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న ‘రణబాలి’ మూవీ ప్రమోషనల్ డాక్యుమెంటరీ సిరీస్ నుంచి మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వియ్ ఫర్ గాట్’ విడుదలయ్యింది. రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళ్‌రెడ్డి, బొబ్బిలి నాగిరెడ్డి వంటి పాలెగాళ్ల వీరోచిత గాథల ఆధారంగా విజయ్ దేవరకొండ పాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వివరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది.
రామ్ చరణ్ ‘RC 17’ క్రేజీ అప్డేట్.. పక్కా ప్లాన్ రెడీ చేస్తున్న సుకుమార్.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC 17’పై ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఏడాది వ్యవధిలోనే షూటింగ్ పూర్తి చేయడమే లక్ష్యంగా సుకుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.

