PM Kisan: దేశంలోని కోట్లాది మంది రైతులకు అదిరే శుభవార్త వచ్చింది. దసరా పండగకు ముందే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27వ తేదీన రైతు పెట్టుబడి సాయం అందించనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అదే రోజున పీఎం కిసాన్ నిధులు సైతం విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది. మరి అందుకు సంబంధించిన వివరాలు, లబ్ధిదారుల జాబితా చెకింగ్ వివరాలు తెలుసుకుందాం.
మ్యాజిక్ చేసిన HDFC స్కీమ్.. రూ.10 వేల SIP పెట్టుబడితో రూ.23 కోట్లొచ్చాయ్.. రూ.1 లక్ష కోట్లు దాటిన AUM
HDFC Flexi Cap Fund Returns: ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అదరగొట్టింది. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. ఈ ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టినట్లయితే ఏకంగా రూ.23 కోట్లు వస్తాయి. అంతే కాదు ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.1 లక్ష కోట్ల మార్క్ దాటడం గమనార్హం. మరి ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
‘కాలినిన్‌గ్రాడ్’కోసం సర్వస్వం ఫణంగా పెడుతోన్న పుతిన్.. ఈ ప్రాంతంతో భారత్‌కున్న సంబంధం ఏంటి?
రష్యా గగనతల రక్షణ, క్షిపణి వ్యవస్థలతో బాల్టిక్ సముద్రంలోని ఓ భూభాగం ఇప్పుడు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఆ ప్రాంతంలో నాటో సైన్యాల ఉనికి పెరగడమే. రష్యా భూభాగానికి దూరంగా.. పొలెండ్- లిథువేనియా మధ్య ఉండే 60 మైళ్ల ప్రాంతం వ్యూహాత్మకంగా మారింది. ఇటీవల అక్కడ నాటో కూటమి వరుసగా వైమానిక విన్యాసాలు, రష్యా ట్యాంకర్లు, నౌకలను అడ్డుకుంటోంది. దీంతో పుతిన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై దాడి జరిగిన అణ్వాయుధాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి భారత్‌తో రక్షణ అనుబంధం ఉంది.
పైలట్‌ను పంపినవాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఫ్లైదుబాయ్ ఘటనపై నెతన్యాహు హెచ్చరిక
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటన.. ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాక్‌పిట్‌లోనే కెప్టెన్‌పై కో-పైలట్ గొడ్డలితో దాడిచేసి, విమానం కూల్చివేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఎవరైనా అతడ్ని పంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడ్ని ఎవరైనా పంపి ఉంటే.. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు హెచ్చరించారు. అతడు ఉగ్రవాద భావజాలానికి ప్రభావితమయ్యాడని అన్నారు.
మియాపూర్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి.. 3 రోజుల క్రితం ఫ్రెండ్‌తో కలిసి వచ్చి..!
మియాపూర్‌లో ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. 3 రోజుల క్రితం ఓ స్నేహితుడితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. అయితే తమ కుమార్తె ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మొబైల్ లొకేషన్ ఆధారంగా మియాపూర్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌కు చేరుకుని చూడగా ఆమె అప్పటికే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమెతో వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ.. త్వరలో 4,538 పోస్టులు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
టీజీఎస్‌ఆర్టీసీలో సిబ్బంది కొరత, ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 4,538 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయని పేర్కొన్నారు. 2017 పీఆర్‌సీ, డీఏ బకాయిలతో పాటు 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న బాండ్లను క్లియర్ చేసినట్లు చెప్పారు. 1,134 కారుణ్య నియామకాలతో పాటు గతంలో తొలగించిన సుమారు 250 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు.
దొంగతనం కేసులున్నా ఆర్మీ ఉద్యోగం.. బొల్లారం ఆయుధాల చోరీ కేసు నిందితుడు మల్లేష్ కేసులో ట్విస్ట్
బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మల్లేశ్‌కు ఆర్మీలో చేరకముందే దొంగతనం కేసులు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో అతని నియామకంపై కూడా విచారణ జరుగుతోంది.ఆర్థిక ఇబ్బందులు, ఆర్మీలో ఎదురైన క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో చోరీకి పథకం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయుధాగారం భద్రతపై ముందుగానే సమాచారం సేకరించి.. కొందరు ఆర్మీ సిబ్బంది సహకారంతో చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
నర్సింగ్ విద్యార్థిని హరిణిని చంపింది ప్రియుడే.. మెడకు బైక్ క్లచ్ వైరు బిగించి దారుణహత్య
కొత్తగూడెం జిల్లాలో 18 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇంటి వద్ద అనుమానాస్పదంగా మృతిచెందిన హరిణిని అదే గ్రామానికి చెందిన దేవరకొండ పవన్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో ఆమెపై దాడి చేసి.. బైక్ క్లచ్ వైరుతో గొంతు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోస్టుమార్టం రిపోర్ట్‌తో ఇది హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న పవన్‌ను సీతారామ ప్రాజెక్టు కాల్వ సమీపంలో అరెస్ట్ చేశారు.
రాశిఫలాలు 03 అక్టోబర్ 2026: లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో కన్య సహా ఈ 5 రాశులకు అపారమైన ప్రయోజనాలు!
రాశిఫలాలు 03 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శుక్రుడు, బుధుడు కలిసి తులా రాశిలో కలయిక జరపడం కారణంగా లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడనుంది. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో కన్య సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

