Home Blog Page 53

“తాటతీస్తా.. తోలుతీస్తా” సొంతపార్టీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వార్నింగ్!

తిరువూరు ఎమ్మెల్యే – విజయవాడ ఎంపీ మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ ఓ టీచర్‌ని కొట్టారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే కొలికపూడి నేరుగా స్పందించారు. ఎంపీ కేశినేని చిన్ని డైరెక్షన్‌లోని నేతలే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే తాటతీస్తా.. తోలుతీస్తా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

SRI KASHI NAYANA DAILY – 4 అక్టోబర్ 2026

బాలసదనంలో జిల్లా తనిఖీ బృందం ఆకస్మిక తనిఖీ

HIV పై అవగాహనకు క్విజ్ పోటీలు – ప్రిన్సిపాల్ ప్రశాంతి

ఇన్ సర్వీస్ టీచర్లకు TET ఉచిత శిక్షణ – UTF

మున్సిపల్ స్కూల్ ఆయాల వేతనాలు పెంచాలి – CITU

ఆలయ పునర్నిర్మాణానికి లక్ష విరాళం

సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం.. గట్టిగా ఇచ్చేసిన హైకోర్టు!

సివిల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం తగదంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల ఆస్తి, భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఎక్కువ పిటిషన్లు రావడంతో విచారించిన హైకోర్టు ఇకపై జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ గట్టిగా చెప్పేసింది. గత అక్టోబర్ 24న రాష్ట్ర డీజీపీ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపింది. ఈ సివిల్ వ్యవహారాల్లో ప్రజలను స్టేషన్లకు పిలిపించి కొందరు పోలీసులు వేధిస్తున్నారని, ఇకపైనైనా స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

అమరావతికి మహర్దశ.. మరో రైల్వే లైన్.. రూ. 599 కోట్లతో టెండర్‌కు ఆహ్వానం!

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంలో కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఎర్రుపాలెం – నంబూరు రైల్వే లైన్ నాలుగో ప్యాకేజీ పనులకు రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. రాజధాని ప్రాంతంలో వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 599.33 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానించింది. రెండున్నర సంవత్సరాల్లో ఈ రైల్వే లైన్ పూర్తి చేయనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు తెలిపారు.

Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

Singeetham Srinivasa Rao Passes Away: భారతీయ చిత్రసీమకు ఎన్నో క్లాసిక్, ప్రయోగాత్మక చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’ వంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

‘ది ప్యారడైజ్’తో చేదు అనుభవం.. మళ్లీ ఫ్యామిలీ, క్లాస్ బాట పడుతున్న నేచురల్ స్టార్ నాని

‘ది ప్యారడైజ్’ చిత్రంలో ప్రవేశపెట్టిన ‘షేర్ నాని’ ట్యాగ్‌కు ఆశించిన ఆదరణ దక్కకపోవడంతో, హీరో నాని మళ్లీ తన సుపరిచిత బ్రాండ్ ‘నేచురల్ స్టార్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి చిత్రాలతో మాస్ యాక్షన్ పీక్స్ చూపించిన ఆయన, ఇప్పుడు కాస్త విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ చేస్తున్న నాని, ఆ తర్వాత పూర్తిగా క్లాస్, ఫ్యామిలీ చిత్రాలు చేయనున్నారు. ‘ఇరుముడి’ ఫేమ్ శివ నిర్వాణతో పాటు, క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. తద్వారా త్వరలోనే నాని మళ్లీ పక్కింటి కుర్రాడి అవతారంలో కనిపించనున్నారు.

ఒంట్లో వేడి తగ్గడానికి బొడ్డులో ఆముదం రాయడం + బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ బెస్ట్‌ చిట్కా!

0
వర్షాకాలం మొదలైందంటే ఎండలు తగ్గుతాయని అనుకుంటాం. కానీ ఈ మధ్య వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండటం.. మధ్యాహ్నానికి ఉక్కపోత పెరగడం.. బయటకు వెళ్తే చెమటలు పట్టడం వంటి పరిస్థితులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో దాహం ఎక్కువగా వేయడం, నీరసం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా బయట ఎక్కువసేపు ఉండేవారిలో శరీరం నుంచి నీరు, లవణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

అంతేకాదు ఒంట్లో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సమయంలో తగినంత ద్రవాలు తీసుకోవడం, ఎండకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మరి వర్షాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరాన్ని ఎలా చల్లగా, హైడ్రేట్‌గా ఉంచుకోవాలి, ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

విజయ్ మాల్యాకు బిగ్ షాక్.. ఇంకా రూ. 8752 కోట్లు బకాయి.. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల ప్రకటన!

0
SBI consortium Mallya: దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా కేసుకు సంబంధించి అప్డేట్ వచ్చింది. మాల్యా నుంచి ఇప్పటివరకు రూ. 10270 కోట్లు రికవరీ చేసినప్పటికీ, ఇంకా రూ. 8751.86 కోట్లు బకాయిగా ఉన్నాయని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం బాంబే హైకోర్టుకు తెలిపింది. రికవరీ చేసిన ఆస్తులతో బ్యాంక్ బకాయిలు పూర్తిగా తీరలేదని, మరోవైపు మనీలాండరింగ్ కేసులు కూడా కొనసాగుతాయని ఈడీ స్పష్టం చేసింది.

Market Crash: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ అంటేనే టెన్షన్.. 1929 నుంచి 1987 వరకు ఏం జరిగింది?

0
Nifty October Performance: భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో భారీగా పతనం అవుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ధరలు పెరుగుతుండటం వంటివి కారణాలుగా ఉన్నాయి. అయితే ఈ అక్టోబరులో మళ్లీ మార్కెట్ సంక్షోభం మరింత పెరగనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అక్టోబర్ నెలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కొన్ని భారీ పతనాల చరిత్రే ఉంది మరి. 1929 వాల్ స్ట్రీట్ క్రాష్, 1987 బ్లాక్ మండే, 2008 ఆర్థిక సంక్షోభం వంటివి కొన్ని ఉదాహరణలు.

PB Fintech: పాలసీ బజార్ షేర్ల పతనం ఇంకెంత కాలం? 6 రోజుల్లోనే 45 శాతం డౌన్.. ఆ ఒక్క కారణంతోనే!

0
PB Fintech Target Price: పాలసీ బజార్, పైసా బజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లు పతనం అవుతూనే ఉన్నాయి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఏకంగా 49 శాతం పడిపోయింది. ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ కమిషన్ మార్పులు కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్, POSP వ్యాపారాలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. బెర్న్‌స్టీన్ సహా పలు బ్రోకరేజీలు ఈ క్రమంలోనే టార్గెట్ ధరల్ని తగ్గించడంతో ఇన్వెస్టర్లలో ఒత్తిడి మరింత పెరిగింది.