తెలంగాణలో 22ఏ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగా నమోదై ఉండి.. నాలా ప్రక్రియ పూర్తికాకపోవడంతో నివాస వినియోగంలో ఉన్న కొన్ని భూముల రిజిస్ట్రేషన్లకు ఇప్పుడు మార్గం సుగమం అయింది. నాలా రుసుములు, ఇతర ప్రభుత్వ ఫీజులు చెల్లించిన తర్వాత అర్హత ఉన్న దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న కొన్ని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతులు ఇచ్చింది.
ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు.. ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈనెల 10 నుంచి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సద్దుల బతుకమ్మ రోజైన ఈనెల 18న ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో భారీ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి బతుకమ్మలతో భారీ ర్యాలీ ట్యాంక్‌బండ్‌కు చేరుకోనుంది. కళాకారులు కూడా తమ జానపద కళారూపాలతో పాల్గొంటారు. బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్‌లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్, లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
ఉస్మానియా, వరంగల్, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం.. ఆసుపత్రులు పూర్తయ్యే సమయానికి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా నియామక ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోళ్లను కూడా వేగవంతం చేయాలని చెప్పారు.
‘హిజాబ్ తీయాలా, గడ్డం కత్తిరించాలా అనేది మీ ఇష్టం’.. ముస్లిం యువతకు ఓవైసీ కీలక సూచనలు
ముస్లిం యువతను ఉద్దేశించి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ అసెంబ్లీలో భయపడకుండా తన అభిప్రాయాలను చెబుతానని.. సీఎంలను కూడా స్పందించేలా మాట్లాడ,mతానని పేర్కొన్నారు. జెన్‌జీ యువత కూడా తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పాలని సూచించారు. హిజాబ్ మహిళల ఇష్టమని.. విద్యను అభ్యసించి జీవిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇక గడ్డం తీయాలా లేదా అని వారి ఇష్టమని పేర్కొన్నారు.
దక్షిణ తెలంగాణ.. కరువు నీడ నుంచి అభివృద్ధి బాటకు.. పాలమూరు నేలపై మారుతున్న ఆర్థిక చిత్రం
ఒకప్పుడు కరువు, వలసలకు నిలయమైన పాలమూరు (దక్షిణ తెలంగాణ) ప్రాంతం సాగునీటి ప్రాజెక్టులు, జిల్లా పునర్వ్యవస్థీకరణతో ప్రగతి పథంలోకి అడుగుపెట్టింది. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా వంటి ప్రాజెక్టులు సాగునీటి లభ్యతను పెంచగా; మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలు తమ ప్రాంతీయ బలాలతో ఆర్థికంగా బలపడుతున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం వల్ల లాజిస్టిక్స్, పరిశ్రమలు, సేవా రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఉపాధి కల్పన, వ్యవసాయ విలువ జోడింపు, సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పాలమూరు కరువు నుంచి శాశ్వత ఆర్థిక స్వావలంబన వైపు వేగంగా వేగంగా అడుగులు వేస్తోంది.
రాశిఫలాలు 04 అక్టోబర్ 2026: పరిఘ యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు సూర్యదేవుని అనుగ్రహం!
రాశిఫలాలు 04 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు పరిఘ, శివ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది సూర్య గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
351 కొట్టినా తప్పని ఓటమి.. భారీ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన షై హోప్..!
న్యూ చండీగఢ్‌లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (129 నాటౌట్), రోహిత్ శర్మ (92) మెరుపులతో 351/7 భారీ స్కోరు చేసింది. అయితే విండీస్ కెప్టెన్ షై హోప్ (162 నాటౌట్) వీరోచిత శతకానికి తోడు అమీర్ జంగో (67) రాణించడంతో, కరేబియన్ జట్టు మరో 10 బంతులు మిగిలుండగానే 352/5 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది.
సెంచరీతో విజిల్ కొట్టిన కేఎల్ రాహుల్.. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు..!
వెస్టిండీస్‌తో జరుగుతున్న 3వ వన్డేలో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఆరంభంలోనే గిల్ (1), కోహ్లీ (0) వికెట్లు కోల్పోయి 4/2తో కష్టాల్లో పడినా, రోహిత్ శర్మ (92), రుతురాజ్ గైక్వాడ్ (57) కోలుకునేలా చేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 351/7 భారీ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో సీల్స్ 3 వికెట్లు తీశాడు.
జ్ఞానేశ్ కుమార్ పదవి పోవడం ఖాయం, జైలుకు వెళ్లే అవకాశం.. వేణుస్వామి సంచలన జోస్యం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జాతకంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 31 తర్వాత గ్రహాల సంచారంలో మార్పులను ప్రస్తావించిన ఆయన.. సీఈసీ పదవికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా అంచనా వేశారు. రాజీనామా లేదా పదవి నుంచి వైదొలగే పరిస్థితులు రావచ్చని పేర్కొన్నారు. జాతకంలో ‘కారాగార దోషం’ ఉందంటూ, భవిష్యత్తులో జైలు సంబంధిత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

