HomeTELANGANAఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు.. ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు

ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు.. ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈనెల 10 నుంచి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సద్దుల బతుకమ్మ రోజైన ఈనెల 18న ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో భారీ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి బతుకమ్మలతో భారీ ర్యాలీ ట్యాంక్‌బండ్‌కు చేరుకోనుంది. కళాకారులు కూడా తమ జానపద కళారూపాలతో పాల్గొంటారు. బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్‌లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్, లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments