సీఎం చంద్రబాబునాయుడుపై.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మండిపడ్డారు. రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏకంగా రూ. లక్ష కోట్లు కేటాయిస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబువన్నీ పిట్టలదొర మాటలేనని X వేదకగా ధ్వజమెత్తారు. రాయలసీమలో ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్షం ఉందని, ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం ‘హార్టికల్చర్ హబ్’ల పేరుతో పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. అక్కడ రైతులు ప్రస్తుతం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అవస్థలను చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.
శబరిమలకు APSRTC బస్సుల బుకింగ్.. ఏడుగురికి ఫ్రీ, గురుస్వాములకు కమీషన్..!
అయ్యప్ప స్వామి భక్తుల కోసం రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రవాణా సంస్థలు కూడా ప్రత్యేక బస్సు సర్వీసుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి ఇందులో భాగంగా APSRTC భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కూడా ప్రకటించింది. భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు.. స్వాములకు ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తుంది. బస్సుల్లో ఆధునిక ఆడియో, వీడియో సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.అమరావతి ఏసీ నుంచి పల్లె వెలుగు వరకు మొత్తం తొమ్మిది రకాల బస్సులను ప్రత్యేక అద్దె ప్యాకేజీలో చేర్చడం జరిగింది.
విజయవాడ నిరసన ఎఫెక్ట్.. సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై కూటమి సర్కార్ సీరియస్.. 46 మందికి షోకాజ్ నోటీసులు
విజయవాడలో నిరసన తెలియజేసిన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని, తోటి ఉద్యోగులను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించిన 46 మందిని పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ 46 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నిరసనలో పాల్గొన్న ఈ 46 మందిలో ఇప్పటికే ఒకరిద్దరిని అధికారులు సస్పెండ్ చేసినట్టు సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో సచివాలయ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఆ రిసార్ట్ అమ్ముకోకుండా ఉంటే నవదీప్ రూ.వందల కోట్లకు అధిపతి… సీక్రెట్ బయటపెట్టిన అజయ్ ఘోష్
సినీ వేదికలపై హీరోల ఆస్తులపై నటుడు అజయ్ ఘోష్ చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 2002లో నవదీప్ తండ్రి రామారావు చీరాల బీచ్ సమీపంలో ‘రామాపురం రిసార్ట్స్’ ప్రారంభించారని, హైదరాబాద్ వచ్చే క్రమంలో దాన్ని అమ్మేశారని తెలిపారు. ప్రస్తుతం ‘ఆంధ్రా గోవా’గా మారిన ఆ ప్రాంతంలో ఆస్తిని అమ్మకుండా ఉంటే నవదీప్ వందల కోట్ల ఆస్తిపరుడయ్యేవాడని పేర్కొన్నారు. గతంలో రవితేజ మామిడి తోట విలువలపైనా ఇలాగే మాట్లాడిన అజయ్ ఘోష్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా వేదికలపై పక్కోళ్ల ఆస్తులు, రియల్ ఎస్టేట్ లావాదేవీలపై లెక్చర్లు ఇవ్వడం ఎందుకంటూ కొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.
Mayalodu Controversy: ‘నేను లేకుండా సినిమా ఎలా తీస్తావో చూస్తా’… రాజేంద్ర ప్రసాద్‌కు ఎస్వీ కృష్ణారెడ్డి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్
1993 నాటి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘మాయలోడు’ షూటింగ్ సమయంలో నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో తలెత్తిన వివాదంపై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా చివరి దశలో రెయిన్ సాంగ్ కోసం డేట్లు ఇవ్వని రాజేంద్ర ప్రసాద్, “నేను లేకుండా సినిమా ఎలా పూర్తి చేస్తావో చూస్తా” అని సవాల్ విసిరారట. దీంతో తీవ్రంగా కలత చెందిన దర్శకుడు, గతంలో బాబూ మోహన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆ డ్యూయెట్‌ను బాబూ మోహన్, సౌందర్యలపై చిత్రీకరించారు. ఆ పాటే “చినుకు చినుకు అందెలతో”గా వెండితెరపై సంచలనం సృష్టించింది. ఒక కమెడియన్‌తో డ్యూయెట్ చేయించి సూపర్ హిట్ కొట్టిన తొలి దర్శకుడిగా నిలిచానని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు.

