PB Fintech Target Price: పాలసీ బజార్, పైసా బజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లు పతనం అవుతూనే ఉన్నాయి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఏకంగా 49 శాతం పడిపోయింది. ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ కమిషన్ మార్పులు కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్, POSP వ్యాపారాలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. బెర్న్‌స్టీన్ సహా పలు బ్రోకరేజీలు ఈ క్రమంలోనే టార్గెట్ ధరల్ని తగ్గించడంతో ఇన్వెస్టర్లలో ఒత్తిడి మరింత పెరిగింది.


