HomeEntertainment‘ది ప్యారడైజ్’తో చేదు అనుభవం.. మళ్లీ ఫ్యామిలీ, క్లాస్ బాట పడుతున్న నేచురల్ స్టార్ నాని

‘ది ప్యారడైజ్’తో చేదు అనుభవం.. మళ్లీ ఫ్యామిలీ, క్లాస్ బాట పడుతున్న నేచురల్ స్టార్ నాని

‘ది ప్యారడైజ్’ చిత్రంలో ప్రవేశపెట్టిన ‘షేర్ నాని’ ట్యాగ్‌కు ఆశించిన ఆదరణ దక్కకపోవడంతో, హీరో నాని మళ్లీ తన సుపరిచిత బ్రాండ్ ‘నేచురల్ స్టార్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి చిత్రాలతో మాస్ యాక్షన్ పీక్స్ చూపించిన ఆయన, ఇప్పుడు కాస్త విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ చేస్తున్న నాని, ఆ తర్వాత పూర్తిగా క్లాస్, ఫ్యామిలీ చిత్రాలు చేయనున్నారు. ‘ఇరుముడి’ ఫేమ్ శివ నిర్వాణతో పాటు, క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. తద్వారా త్వరలోనే నాని మళ్లీ పక్కింటి కుర్రాడి అవతారంలో కనిపించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments