ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామీణ కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వీబీ జీరాంజీ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 15 రోజుల్లోనే కార్డులు అందించాలని ఆదేశించింది. ఇప్పటికే 18 జిల్లాల్లోని 265 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పంటల సాగు తగ్గడంతో కూలీలకు పనులు, ఆదాయం తగ్గిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో రోజుకు 100 నుంచి 150 మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
“ప్రయోగాల కాలం ముగిసింది.. ఇక వరల్డ్ కప్ టీమ్‌తోనే ఆడతాం..”: శుభ్‌మన్ గిల్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో 1052 పరుగులు సమర్పించుకోవడంతో ఇకపై ఎలాంటి ప్రయోగాలు చేయబోమని, వరల్డ్ కప్‌లో ఆడే తుది కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. అరంగేట్ర బౌలర్లు అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీల వైఫల్యాన్ని సమర్థిస్తూనే, నాసిరకం ఫీల్డింగ్ వల్లే ప్రత్యర్థికి ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చిందని గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఏషియన్ గేమ్స్ 2026లో భారత స్వర్ణ పతక విజేతల ఫుల్ లిస్టే ఇదే..!
ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 21 స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. సెప్టెంబర్ 22న మహిళల క్రికెట్ జట్టు అందించిన తొలి పసిడితో ప్రారంభమైన భారత్ రన్.. ఆక్టోబర్ 3న పురుషుల హాకీ జట్టు విజయం వరకు కొనసాగింది. క్రికెట్, కబడ్డీ, హాకీలలో పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా, ఆర్చరీ, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్‌లలో భారత అథ్లెట్లు పసిడి జెండాను ఎగురవేశారు.
ఏషియన్ గేమ్స్‌లో భారత్ ధమాకా.. 85 పతకాలతో నాలుగో స్థానం ఖరారు..!
ఐచి-నాగోయాలో జరిగిన ఆసియా క్రీడలు 2026లో భారత్ 85 పతకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. చివరి రోజు పురుషుల హాకీ జట్టు సాధించిన 21వ స్వర్ణంతో భారత్ ఉజ్బెకిస్థాన్‌ను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలతో ఇది భారత్‌కు రెండో అత్యుత్తమ ఆసియాడ్ ప్రదర్శనగా నిలిచింది. హాకీ, కబడ్డీ, క్రికెట్‌లలో భారత జట్లు డబుల్ స్వర్ణాలు గెలిచాయి.
వన్డేల్లో సచిన్ రికార్డు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్..!
భారత దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి సచిన్ టెండూల్కర్ (214 ఇన్నింగ్స్‌లు) రికార్డును బద్దలు కొట్టాడు. 2013 నుంచి రెగ్యులర్ ఓపెనర్‌గా మారాక రోహిత్ వెనక్కి తిరిగి చూడలేదు. వన్డేల్లో రోహిత్ ఖాతాలో మొత్తం 12,000 పైచిలుకు పరుగులు ఉన్నాయి.
SIR నిరసనల్లో మహిళా జర్నలిస్ట్‌లపై ఢిల్లీ ఏసీపీ లైంగిక వేధింపులు.. స్టేషన్ ముందు బైఠాయించిన సీజేపీ కార్యకర్తలు
దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు, ఇందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యుడ్ని చేస్తూ రాజీనామా చేయాలని అక్టోబరు 2 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్షాలు ఆందోళనలు ప్రారంభించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా జర్నలిస్ట్‌లపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీస్ స్టేషన్ ముందు సీజేపీ కార్యకర్తలు కూర్చుని, నిరనస తెలుపుతున్నారు.
బస్సు కొంచెం ముందుకు ఆపారని రెచ్చిపోయిన మహిళలు.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఊహించని ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు, సిబ్బందిపై కొందరు మహిళలు కోడిగుడ్లతో దాడి చేశారు. గురజాలలోని మాడుగుల రహదారి దగ్గర బస్సును కొంచెం ముందుకు ఆపారనే కోపంతో ఓ మహిళ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. కొందరు మహిళలు ఆ బస్సు మళ్లీ తిరిగి వచ్చే సమయానికి రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి, బస్సుపై దాడి చేశారు. అడ్డుకున్న డ్రైవర్, కండక్టర్‌ను కూడా కొట్టారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కొందరుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు హైటెక్ హంగులు.. ఇంద్రకీలాద్రిపై ‘ఏఐ’ నిఘా.. దర్శనానికి ఏఐ డిస్‌ప్లేలు
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది. దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భద్రత, పరిశుభ్రత, సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ ఈ ఏడాది దసరా సంబరాలు విజయవాడలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలు సజావుగా జరగడానికి సుమారు 3,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 24 గంటల పాటు సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. అక్టోబర్ 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాధారణ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందని దుర్గగుడి ఈవో శీనా నాయక్ వెల్లడించారు.
వారం రోజులు గాల్లోంచి పడుతున్న రాళ్లు.. రాత్రైతే వణుకు.. అప్పాజీపేటలో మిస్టరీ!
అనంతపురం జిల్లాలో అప్పాజీపేటలో వారం రోజులుగా గాల్లోంచి రాళ్లు పడుతున్నాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో.. ఎలా పడుతున్నాయో అర్థం కాక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా పెట్టిన సమయంలో ఈ రాళ్లు పడ్డాయి. దీంతో ఇది ఏ దెయ్యం పనో అని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వామిజీల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. అయితే ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు మాత్రం రాత్రిపూట నిద్రపోలేకపోతున్నామని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించమని కోరుతున్నారు.
ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా భారీ గృహనిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 3 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియతో పాటు అత్యాధునిక సాంకేతికతతో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టుకు గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలిసి శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో 175 ఇళ్లను నిర్మించనున్నారు. కేంద్రం, సీఎస్‌ఐఆర్-సీబీఆర్‌ఐ, ఏపీ ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.

