HDFC NFO: ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి న్యూ ఫండ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ప్లస్ 8- 13 ఇయర్స్ జీ-సెక్ 70:30 ఇండెక్స్ ఫండ్ పేరుతో ఈ కొత్త స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 5వ తేదీ నుంచే మొదలవుతోంది. మరి ఈ న్యూ ఫండ్ ఆఫర్ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుందాం.
డీమార్ట్‌కు 3 నెలల్లో రూ.19,206 కోట్ల ఆదాయం.. కొత్త స్టోర్లతో జోరు.. ఫోకస్‌లోకి అవెన్యూ సూపర్ మార్ట్స్ షేరు!
Dmart Q2 Results: ప్రముఖ రిటెయిల్ వ్యాపార సంస్థ డీమార్ట్ అదరగొడుతోంది. గడిచిన 3 నెలల కాలంలోనే ఏకంగా రూ.19,206 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాజాగా జులై- సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కొత్త స్టోర్లతో బిజినెస్‌లో జోరు కనబరుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రేదశ్ సహా పలు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ చేపడుతోంది. క్యూ2 ఫలితాల్లో అదరగొట్టిన క్రమంలో డీమార్ట్ షేరు ఫోకస్ లోకి వచ్చింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
BSNL మరో ధమాకా ఆఫర్.. రూ.1కే అపరిమిత కాల్స్+ రోజుకు 1GB + 24 రోజుల వ్యాలిడిటీ.. అక్టోబర్ 12 వరకే ఛాన్స్!
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి ధమాకా ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 1 ఫ్రీడమ్ 2.0 ప్లాన్ మళ్లీ తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 1జీబీ డేటా, 24 రోజుల వ్యాలిడిటీ సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
Personal Loan: దసరా, దీపావళి ఖర్చులకు సైతం ‘బ్యాంక్ లోన్’.. మీరూ తీసుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే..!
Personal Loan: ప్రస్తుత రోజుల్లో ఎలాంటి ఆర్థిక అవసరం ఉన్నా బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. ఇక దసరా, దీపావళి పండుగల ఖర్చులకు సైతం పర్సనలో లోన్ తీసుకుంటారు. లేదా కొంత మంది క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పు తీసుకుని పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. ఇలా మీరు కూడా ఈ దసరా, దీపావళికి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, జాగ్రత్త. ఇలా లోన్ తీసుకునే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
Flydubai Plane: ‘నాకు చావంటే భయం లేదు’ విచారణలో వెల్లడించిన ఫ్లైదుబాయ్ విమానం కో-పైలట్ హమ్మమ్
సెప్టెంబరు 30న యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగిన ఘటన యావత్తు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కాక్‌పిట్‌లోని కెప్టెన్, కో-పైలట్ మధ్య ఘర్షణ జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కెప్టెన్‌పై దాడిచేసి, విమానం కూల్చివేయడానికి కో-పైలట్ ప్రయత్నించినట్టు తర్వాతే తెలిసింది. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ధైర్యంగా ఎదుర్కొన్న తీరుపై ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, నిందితుడి ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితమైనట్టు తేలింది.
రష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం
ఉక్రెయిన్‌పై ఐదున్నరేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా.. ఇటీవల అత్యంత వేగవంతమైన, చౌవకైన ఇరాన్ అభివృద్ధి చేసిన షాహీద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. దీంతో వీటిని అడ్డుకోవడం ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థకు కష్టంగా మారింది. తాజాగా, ఉక్రెయిన్‌పై మాస్కో జరిపిన డ్రోన్ దాడిలో భారతీయ ఫార్మా కంపెనీ ధ్వంసమైంది. సుమీ నగరంలో కుసుమ్ గ్రూప్ నిర్వహిస్తున్న ఫార్మ కంపెనీపై దాడితో భారీ నష్టం వాటిళ్లినట్టు నివేదికలు అందుతున్నాయి. అలాగే, మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
Hyderabad: ఫుడ్ ఆర్డర్ డెలవరీ ఆలస్యమైందని జొమాటో ఏజెంట్‌పై దంపతులు దాడి… వీడియో వైరల్
జొమాటో డెలివరీ ఏజెంట్‌పై ఓ కస్టమర్, అతడి భార్య దాడికి పాల్పడ్డారు. వారు పెట్టిన ఫుడ్ ఆర్డర్‌ను అనుకున్న సమయానికి తీసుకురాలేదని వాగ్వాదానికి దిగిన ఈ జంట.. అనంతరం చేయి చేసుకున్నారు. అయితే, కస్టమర్ బుకింగ్ సమయంలో యాప్ లొకేషన్ తప్పుగా ఉండటంతో.. సరైన అడ్రస్ కనుక్కుని వెళ్లేసరికి కొన్ని నిమిషాలు జాప్యం జరిగింది. దీంతో డెలివరీ ఆలస్యంపై ఏజెంట్, కస్టమర్‌కు మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. వివాదం మరింత ముదరడంతో కస్టమర్, అతడి భార్య కలిసి దాడికి పాల్పడ్డాడు.
సీనియర్ సిటిజన్లకూఫ్రీ బస్సు… తెలంగాణ సర్కార్ ఆలోచన..?
తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. ఇదే తరహాలో వృద్ధులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు దాటిన వారికి టికెట్ ధరపై 25 శాతం రాయితీ అమల్లో ఉండగా.. తెలంగాణలో మాత్రం పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఆర్టీసీపై ఉన్న ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 31 ఏళ్ల మహిళ దారం సుప్రియ మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన ఆమె ఉద్యోగరీత్యా మిస్సోరిలో నివసిస్తున్నారు. తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో మహబూబాబాద్‌లోని కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
అమల్లోకి క్యూఆర్-2026 చట్టం.. మూడు కార్పొరేషన్లలో కొత్త ఆస్తిపన్ను
మూడు కార్పొరేషన్లలో ఏకరూప పాలన కోసం రూపొందించిన క్యూర్-2026 చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో భూవిలువ ఆధారిత ఆస్తిపన్ను విధానం అమల్లోకి రానుంది. 375 చదరపు అడుగుల్లోపు ఇళ్లకు ఏడాదికి రూ.101 పన్నుగా నిర్ణయించారు. కొత్త ఆస్తులకు ఏప్రిల్ 1 నుంచి విధానం వర్తించనుండగా.. పాత భవనాలకు 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త పద్ధతిలో పన్ను వసూలు చేయనున్నారు. అనధికార నిర్మాణాలకు 25 నుంచి 300 శాతం వరకు జరిమానా విధించనున్నారు.

