జొమాటో డెలివరీ ఏజెంట్‌పై ఓ కస్టమర్, అతడి భార్య దాడికి పాల్పడ్డారు. వారు పెట్టిన ఫుడ్ ఆర్డర్‌ను అనుకున్న సమయానికి తీసుకురాలేదని వాగ్వాదానికి దిగిన ఈ జంట.. అనంతరం చేయి చేసుకున్నారు. అయితే, కస్టమర్ బుకింగ్ సమయంలో యాప్ లొకేషన్ తప్పుగా ఉండటంతో.. సరైన అడ్రస్ కనుక్కుని వెళ్లేసరికి కొన్ని నిమిషాలు జాప్యం జరిగింది. దీంతో డెలివరీ ఆలస్యంపై ఏజెంట్, కస్టమర్‌కు మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. వివాదం మరింత ముదరడంతో కస్టమర్, అతడి భార్య కలిసి దాడికి పాల్పడ్డాడు.


