వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో కూల్ న్యూస్ చెప్పింది. రాగల మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఏపీలో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమలో వర్షాలు పడనున్నాయి. సోమవారం, మంగళవారం ఉరుముల, మెరుపులత కూడిన వానలు రావడంతో పాటు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలలు వీచే ఛాన్స్ ఉంది. దీంతో చాలా ప్రాంతాలు చల్లబడనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందనున్నారు.
తల్లికి వందనం రెండో విడతపై అప్‌డేట్ .. రూ.13000 పడాలంటే ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి
తల్లికి వందనం రెండో విడత నిధుల మంజూరుపై కీలక అప్‌డేట్ వచ్చింది. రెండో విడత నిధులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన చర్యలు వేగంగా పూర్తి చేస్తుంది. ఈ నిధుల విడుదలకు ఇప్పటికే ఆర్ధిక శాఖ అనుమతి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ రానుంది. ఈ మేరకు ఈ నెల రెండో వారంలో తల్లికి వందనం రెండో విడత నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం లబ్ధిదారులు విద్యార్థి, తల్లి ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
mammootty vs dulquer salmaan: తండ్రీ కొడుకుల బాక్సాఫీస్ ఫైట్.. మమ్ముట్టి vs దుల్కర్ సల్మాన్
మలయాళ స్టార్ తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నవంబర్ 20న విడుదల కానుండగా, ధనుష్ – మమ్ముట్టి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘ఓం’ కూడా అదే తేదీకి రానుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన క్లాష్ ఏర్పడుతోంది.
కమ్మరోళ్ళ గంగగా శర్వానంద్ విశ్వరూపం.. ఒళ్లు గగుర్పొడిచేలా ‘భోగి’ టీజర్
హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’ టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. 1960ల నాటి తెలంగాణ సరిహద్దు నేపథ్యంతో రూపొందిన ఈ టీజర్‌లో శర్వానంద్ ‘గొబ్బులగుట్ట గంగ’గా మునుపెన్నడూ చూడని అత్యంత భీకరమైన మాస్ అవతారంలో కనిపించారు. ఒంటినిండా రక్తపు చారికలు, పదునైన ఆయుధం, పక్కా తెలంగాణ యాసతో శర్వా పలికిన సంభాషణలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీ పోస్టుల వల్లే ఆ వీడియోకి మరింత పబ్లిసిటీ వచ్చింది… సెలబ్రెటీలపై ఆర్జీవీ ఫైర్
‘దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే” పాటకు సంబంధించి జాన్వీ కపూర్ ఏఐ డీప్‌ఫేక్ వీడియో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందించిన సినీ ప్రముఖుల తీరును ఆయన తప్పుపట్టారు. సెలబ్రిటీలు వరుస ట్వీట్లు చేయడం ద్వారా ఆ అభ్యంతరకర వీడియోకు అనవసర ప్రచారం కల్పించి, కోట్లాది మంది చూసేలా చేశారని విమర్శించారు. నిజంగా చేయాల్సింది ఆ వికృత చేష్టకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడమే తప్ప, ఇలా బహిరంగంగా బాధితురాలి పేరును, కంటెంట్‌ను హైలైట్ చేస్తూ ప్రచారం చేయడం కూడా నేరమేనని ఆర్జీవీ పేర్కొన్నారు. ఆర్జీవీ లేవనెత్తిన ఈ పాయింట్‌కు నెటిజన్ల నుంచి కూడా విస్తృతంగా మద్దతు లభిస్తోంది.
Singeetham Srinivasa Rao Died: 95 ఏళ్ల వయసులో సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్… చివరి స్క్రిప్ట్ సెట్స్ మీదికి వెళ్లకుండానే పైలోకాలకు
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆఖరి శ్వాస వరకు సినిమానే శ్వాసగా బతికారు. 94 ఏళ్ల వయసులో ‘సింగ్ గీతం’తో మెప్పించిన ఆయన, 95వ పడిలోనూ తన 62వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఆయన శిష్యుడు, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ (కత్తినే కోసే పండు) అనే విలక్షణమైన టైటిల్‌ని ఆయన ఖరారు చేశారు. ఈ సరికొత్త ప్రయోగాన్ని వెండితెరపై ఆవిష్కరించేలోపే ఆయన కన్నుమూయడం సినీ లోకానికి తీరని లోటు. ప్రస్తుతం ఆలోచనగా మిగిలిన ఈ వినూత్న కథను భవిష్యత్తులో నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
నెల తిరక్కుండానే డిజిటల్ బాట… ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూరి – సుహాస్ మాస్ యాక్షన్ డ్రామా
కోలీవుడ్ నటుడు సూరి, తెలుగు యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ త్వరలోనే డిజిటల్ తెరపై సందడి చేయనుంది. సముద్రపు నేపథ్యం, సంప్రదాయ పడవల పందెం చుట్టూ సాగే ఈ చిత్రం థియేటర్లలో రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఘన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 8 లేదా 9 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నెల రోజులు గడవకముందే ఇంతటి భారీ హిట్ సినిమా ఓటీటీ బాట పట్టడం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
చికెన్ నారలాగా సాగకుండా జ్యూసీగా ఉడకడానికి ప్రముఖ చెఫ్ సింపుల్ చిట్కా, వంటింట్లో దొరికే నిమ్మరసం + ఉప్పు చాలు!
మనలో చాలా మందికి చికెన్ అంటే తెగ ఇష్టం. క్రిస్పీ క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ తినాలని ఆశపడుతుంటారు. అయితే, ఇంట్లో చికెన్ చేసినప్పుడు అది రెస్టారెంట్ స్టైల్‌లో రాదు. రబ్బరులా సాగుతూ చాలా సార్లు ఇబ్బంది పెడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి క్లారిటీ లేదు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయినా సరే వండటానికి కాసేపు ముందు చికెన్‌ను మసాలాలతో మారినేట్ చేసి కాసేపు పక్కన పెడితే రుచి రెట్టింపు అవుతుంది. చికెన్‌తో చేసే ఏ వంటకం అయినా సరే.. ముందుగానే మారినేట్ చేయడం వల్ల గంటల తరబడి మారినేట్ చేయడానికి మన దగ్గర సమయం ఉండదు.
ఇలాంటి సమయంలో బోన్‌లెస్ చికెన్ వండితే అది త్వరగా ఉడగదు. తింటున్నప్పుడు నారలాగా సాగుతూ రుచి ఉండదు. మనం రెస్టారెంట్లలో బోన్‌లెస్ చికెన్ ఐటమ్స్ తిన్నప్పుడు అవి ఎంతో మెత్తగా నోట్లో కరిగిపోయేలా ఉంటాయి. కానీ ఇంట్లో వండినప్పుడు మాత్రం అలా రాదు. అయితే, రెస్టారెంట్లలో చికెన్ అంత సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండటాని చెఫ్‌లు ఏం చేస్తారు? దీనికి సంబంధించి ప్రముఖ చెఫ్ పంకజ్ బధోరియా ఒక సులభమైన చిట్కా పంచుకున్నారు. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో వైఫై + 1000 టీవీ ఛానళ్లు + 12 OTT యాప్స్.. వివరాలు ఇవే!
Jio 3 In 1 Plan: రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ‘జియో హోమ్ 3-ఇన్-1’ ప్లాన్ ప్రకటించింది. ఒకే రీఛార్జ్‌తో అపరిమిత ఇంటర్నెట్, వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 12కు పైగా ఓటీటీ యాప్స్ లభిస్తాయి. విడి విడిగా టీవీ, వై-ఫై ప్యాక్‌లను సైతం పరిచయం చేసింది. ఈ ఆఫర్ జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

