Home Blog Page 49

యూత్‌ను ఆకట్టుకునేలా ‘ధరణి ఐ లవ్ యు’… పోస్టర్ విడుదల చేసిన నిర్మాత ఎస్‌కేఎన్

‘ధరణి ఐ లవ్ యు’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఘనంగా ఆవిష్కరించారు. గతంలో దర్శకుడు రాజమౌళి వద్ద ‘మగధీర’ చిత్రానికి అసోసియేట్‌గా పనిచేసిన సాయికృష్ణ కె.వి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టైటిల్, పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని పేర్కొన్న ఎస్‌కేఎన్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వరుస విజయాలతో బిజీగా ఉన్న ఎస్‌కేఎన్ తమ పోస్టర్ లాంచ్ చేయడం గొప్ప ప్రారంభాన్ని ఇచ్చిందని చిత్ర దర్శకుడు సాయికృష్ణ, నిర్మాత రాజశేఖర్ మద్దికుంట, ప్రధాన తారాగణం వంశీ, మహిత ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.

‘యుద్ధం ఇంకా ముగియలేదు’.. ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రశంసలు

ఫ్లైదుబాయ్ విమానం హైజాక్‌కు కో-పైలట్ చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. భారతీయ కెప్టెన్ అతడ్ని అడ్డుకోవడంతో ప్రయాణికులు సహా 180 మంది ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనపై అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తాజాగా ఓ సంపాదకీయం ప్రచురించింది. ఒమాన్‌కు చెందిన నిందితుడిపై ప్రశంసలు కురిపించింది. అంతేకాదు, ఇంతటితో యుద్ధం ఆగిపోలేదని, అసలు సినిమా ముందుందని అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు చేసింది. ఇలాంటి దాడులకు పాల్పడాలని పిలుపునివ్వడం గమనార్హం.

స్మిత్‌పై దాడి తర్వాత కో-పైలట్‌ను వదిలేయాలని ఫ్లైదుబాయ్ సిబ్బంది డిమాండ్.. వెలుగులోకి వీడియో

గతవారం యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిన ఘటనతో యావత్తు ప్రపంచ దిగ్భ్రాంతికి గురైంది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ గొడ్డలితో దాడిచేసి, అనంతరం విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయనపై దాడిచేసిన కో-పైలట్‌ను ప్రయాణికులు పట్టుకుని బంధించారు. అయితే, విమానం సిబ్బంది అతడ్ని వదిలేయాలని చెప్పినట్టు ప్రయాణికులు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలంగాణకు బీసీ సీఎం అవుతారు.. రేవంత్, రాహుల్ మద్దతిస్తారు: టీసీపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

0
దేశవ్యాప్తంగా ఓబీసీ జనాభా లెక్కలను చేపట్టాలనే కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. అంతేకాదు, బీసీల హక్కుల కోసం అన్ని కులాల మద్దతుతో పోరాడతామని, అవసరమైతే లాక్కుంటామని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. బీసీ కులగణన పూర్తిచేసి, రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

రాశిఫలాలు 05 అక్టోబర్ 2026: శివ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

రాశిఫలాలు 05 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శివ, సిద్ధ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 05 October 2026: ఈరోజు నక్షత్రం, తిథి, యోగం, శుభ ముహుర్తాలు, రాహుకాలం వివరాలివే

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని దశమి తిథి నాడు, సోమవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నో మోర్ డిఫెన్స్.. ఓన్లీ ఎటాక్.. ‘న్యూ వెర్షన్’తో బౌలర్లను భయపెడుతున్న కోహ్లీ..!

0
37 ఏళ్ల వయసులో, 15 వేల వన్డే పరుగుల రికార్డు దాటిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ గేర్‌ను మార్చి కొత్త ‘వెర్షన్’ను ఆవిష్కరించాడు. టెస్ట్ క్రికెట్‌ నుంచి వైదొలిగిన తర్వాత, ఎలాంటి ఒత్తిడి లేకుండా మైదానంలోకి అడుగుపెడుతున్న విరాట్, తొలి 20 బంతుల్లోనే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తున్నాడు. సిక్సర్లు కొట్టడం, క్రీజును ఉపయోగించి పేసర్లను భయపెట్టడంలో సరికొత్త అగ్రెషన్‌ను చూపిస్తూ వన్డేల్లో మళ్లీ తిరుగులేని శక్తిగా నిలుస్తున్నాడు.

కోట్లాది ఓట్ల తొలగింపు రాజ్యాంగ ఆత్మపైన దాడే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

0
దేశంలో ప్రస్తుతం ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో లక్షలాది మంది పేర్లను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి.. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల తొలగింపు రాజ్యాంగ ఆత్మపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ఇక ఎస్ఐఆర్ విషయంలో ప్రతిపక్షాల ఈసీ ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త ఆందోళన ప్రారంభించాయి.

‘మీకెందుకు అంత కంగారు’.. డీఎంకే విమర్శలకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

0
తమిళనాడులో అక్టోబరు 6న రెండు స్థానాలకు ఉప-ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో అధికార టీవీకే, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో సీఎం విజయ్ ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సినిమా షూటింగ్‌గా అభివర్ణించారు. తన నియోజకవర్గంలో ఓటర్లను గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా కలవని సీఎం.. ఇప్పుడు మాత్రం తెగ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10 చోట్ల కూడా ప్రచారం చేయలేదని ఎద్దేవా చేశారు.

రూ. లక్ష కోట్లు ఎక్కడ?.. ఎండిన పొలాల్లో ఫ్లెక్సీలతో రాయలసీమ రైతుల వినూత్న నిరసన

రాయలసీమ రైతులు వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఎండిపోయిన పొలాల్లో ఫ్లెక్సీలను పెట్టి తమ ఆక్రోశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం కోసం నేరుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఫ్లెక్సీల ఫోటోలు సోషల్ మీడియాలో కూడా దర్శనమివ్వడంతో దీనిపై చర్చ నడుస్తుంది. కాగా రాయలసీమలో సరైన వర్షాలు పడక.. అక్కడ పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది అన్నమయ్య జిల్లా, సత్యసాయి, చిత్తురు జిల్లాల్లో అత్యంత కనిష్టమైన వర్షాలు పడ్డాయి.