Markapur To Ongole Railway Line Proposal: ఏపీలో మరో కొత్త రైల్వే ప్రతిపాదన వచ్చింది. గతంలో దొనకొండ నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ కోసం రైల్వేశాఖ ప్రతిపాదించింది. తాజాగా ఈ రైల్వే లైన్‌కు సంబంధించి మార్పులు చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దొనకొండ కాకుండా మార్కాపురం నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. మార్కాపురం నుంచి రైల్వే లైన్ ప్లాన్ చేస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఉపయోగంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
తాడిపత్రిలో చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఐపీ నోటీసు పంపించాడు.. రూ.1.65 కోట్ల అప్పులు చేసిన మోహన్
Anantapur Man Sends IP Notice To Ammavari Temple: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి అమ్మవారికి ఐపీ నోటీసులు వచ్చాయి. మోహన్ అనే వ్యక్తి చౌడేశ్వరి దేవి ఆలయానికి బాకీ పడ్డ రూ.3 లక్షలు చెల్లించలేనని ఐపీ నోటీసు పంపాడు. ఆయన మొత్తం 56 మంది నుంచి 1.65 కోట్ల అప్పులు చేశాడు. ఈ మేరకు మోహన్ తాను చేసిన అప్పులు తీర్చలేనని అందరికి ఐపీ నోటీసులు పంపి షాకిచ్చాడు.
అమరావతి ORRలో 17 ఇంటర్‌ఛేంజ్‌లు.. 8 డబుల్ ట్రంపెట్, ఒక సింగిల్ ట్రంపెట్, 8 రోటరీ.. ఫుల్ లిస్ట్ ఇదే!
Amaravati Outer Ring Road Inter Changes: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణం కోసం స్పీడ్ పెంచారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే టెండర్లు విడుదల చేయగా.. తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ ఓఆర్‌ఆర్‌లోకి ఎంట్రీ, ఎగ్జిట్ కోసం ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి. 8 చోట్ల డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లు, ఒక సింగిల్, 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లను (మొత్తం 17) ఏర్పాటు చేయనున్నారు. 6 వరుసలతో యాక్సెస్ కంట్రోల్డ్‌గా ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు.
విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక.. దసరా ఆర్జిత సేవల టికెట్ల విడుదల
Vijayawada Durga Temple Dasara Arjitha Seva Tickets: విజయవాడ దుర్గగుడి దసరా ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించే ఆర్జిత సేవల టికెట్లు విడుదలయ్యాయి.. 16వ తేదీకి సంబందించి మాత్రం అందుబాటులో ఉండవు. భక్తులు ఆలయ వెబ్‌సైట్, లేదా మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీలో BPCL ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు.. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో, వేలాదిమందికి ఉద్యోగాలు
Environmental Clearances For Andhra Pradesh Bpcl Refinery: ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఏటా 9-12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును 2030నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. . బీపీసీఎల్భారీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు.
తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఏనుగు దాడి చేయడంతో మావటికి తీవ్ర గాయాలు.. అసలు ఏం జరిగింది?
Temple Elephant Attacks Mahout At Tiruchanoor:తిరుచానూరులో ఏనుగు మావటిపై దాడి చేసిన ఘటన కలకలంరేపింది. శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఈ ఘటన జరిగింది.. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఏనుగు పేరు శ్రీనిధి కాగా.. దాదాపు 20 ఏళ్ల నుంచి ఆలయంలో సేవలందిస్తోంది. ఆదివారం సాయంత్రం ఊంజల్ సేవ కోసం తీసుకొచ్చి మళ్లీ తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే మిగిలిన మావటిలు ఏనుగును శాంతింపచేశారు.
Naga Chaitanya: నాగ చైతన్యతో సినిమా చేయాలని ఆశ పడుతున్న బండ్ల గణేష్.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు?
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న బండ్ల గణేష్.. అక్కినేని నాగచైతన్యతో వర్క్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో చైతూను కలిసి “ఒక్క సినిమా ఇవ్వు బాబూ.. బ్లాక్ బస్టర్ తీస్తా” అని కోరగా, దానికి చైతన్య సానుకూలంగా స్పందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై అక్కినేని వారసుడితో సినిమా చేయడానికి బండ్ల గణేష్ ఓ దర్శకుడిని కూడా సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా హింట్ ఇచ్చారు.
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా పడనుందా? నాగవంశీ మళ్లీ మాట తప్పుతున్నారా?
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ చిత్రం మరోసారి వాయిదా పడనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 2న రావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9కి రీషెడ్యూల్ చేశారు. ఖచ్చితంగా ఆ తేదీకే వస్తామని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల ఈ సినిమాను మళ్లీ వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
janhvi kapoor: ‘ఇది లైంగిక దాడితో సమానం’.. ఏఐ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ స్పందన
janhvi kapoor: ‘చుట్టమల్లె’ సాంగ్ ను ఏఐతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను సృష్టించడం లైంగిక దాడితో సమానమని మండిపడ్డారు. సాంకేతికతను దుర్వినియోగం చేసే మనస్తత్వం మారాలని పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ వేధింపులపై తన తరఫున మాట్లాడి మద్దతుగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్, ఖుష్బూలకు జాన్వీ ధన్యవాదాలు తెలిపారు.

