Home Blog Page 47

భర్త, కూతురును కోల్పోయి.. కంటి చూపు పోయినా ఆర్‌ఏఎస్ సాధించిన మహిళ.. అసలెవరీ రోహిణి గుర్జర్?

0
డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయికి పెళ్లి చేశారు. ఇద్దరు పల్లలు పుట్టిన కొన్నేళ్లకే భర్త గుండెపోటుతో మరణించాడు. అత్తింటి వాళ్లూ ఆదరించలేదు. కానీ ఆమె తమ్ముడి సాయం, నానమ్మ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చదవడం ప్రారంభించింది. ఈ సమయంలోనే తనకు ఎంతో సాయంగా ఉన్న నానమ్మ ప్రాణాలు కోల్పోయింది. అయినా బాధను దిగమింగుకుని రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసేందుకు సిద్ధం కాగా.. పరీక్షకు పది రోజుల ముందు పెద్ద కుమార్తె చనిపోయింది. అయినా తమ్ముడి మాటలు, చిన్న కుమార్తె భవిష్యత్తు కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కానీ బిడ్డ చనిపోయిన 8 రోజులకే యాక్సిడెంట్ అయి కన్నుకు తీవ్ర గాయామైంది. చూపు మందగించింది. అయినా పరీక్ష రాసి ఆర్ఏఎస్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది రోహిణి గుర్జర్. ఆమె స్టోరీ మీకోసం.

ఇజ్రాయెల్‌ విమానాశ్రయంపై 9/11 తరహా కుట్ర.. జులైలోనే విమానాన్ని కూల్చేందుకు ఫ్లైదుబాయ్ కో-పైలట్ ప్లాన్.. కానీ ఎందుకు ఆగాడంటే?

0
టెల్ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌‌పై కూల్చివేసి 9/11 తరహా దాడికి ఒమన్‌ కో-పైలట్ హమామ్ అల్-హమామీ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.అంతేకాకుండా ఈ దాడని మూడు నెలల క్రితం అంటే జులైలోనే చేయాలని భావించినప్పటికీ.. ఆ ఆలోచనను అల్ హమామీ విరమించుకున్నాడు. అసలు అప్పుడే ప్లాన్ చేసిన దాడిని ఎందుకు విరమించుకున్నాడు, మళ్లీ ఇప్పుడే దాడికి ఎందుకు పాల్పడ్డాడు వంటి పూర్తి వివరాలు మీకోసం.

‘ఆ కంపెనీతో మాకు సంబంధం లేదు’: శ్రీసిటీ బాయిలర్ పేలుడు వివాదంపై ‘టాబ్లెట్స్ ఇండియా’ స్పష్టత

0
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ ఫార్మా ప్లాంట్‌లో సంభవించిన ఘోర బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. ఈ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ‘టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్’ స్పష్టం చేసింది. పేరు పోలికల వల్ల వచ్చిన అపోహలను తొలగిస్తూ.. శ్రీసిటీలో తమకు ఎలాంటి తయారీ యూనిట్ లేదని, ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో తమకు ఎలాంటి కార్పొరేట్ సంబంధాలు లేవని వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రజలు, మీడియా సంస్థలు గుర్తించాలని స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

చేతులెత్తి మొక్కుతున్నా.. నన్ను వదిలేయండి : బండ్ల ఎమోషనల్ ట్వీట్‌‌ వెనుక ఆంతర్యం ఏమిటి?

సోషల్ మీడియాలో మరోసారి ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. తమ పర్సనల్ ప్రయోజనాల కోసం లేదా టైమ్ పాస్ కోసం తన పేరును వాడుకుంటూ తన జీవితానికి అన్యాయం చేస్తున్నారని ఆ పోస్ట్‌లో బండ్ల గణేష్ వాపోయారు. తనకు ఎటువంటి పదవులు, హోదాలపై వ్యామోహం లేదని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ, సీని రంగాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో మాత్రం అందులో లేదు. కానీ దీనిపై నెటిజన్లు మాత్రం తెగ స్పందిస్తున్నారు.

ఏపీ పింఛన్ల పంపిణీ విధానంలో చిన్న మార్పు.. నవంబర్ 1 నుంచి చేతికి కొంత.. ఖాతాలోకి కొంత

ఏపీ పింఛన్‌ల పంపిణీలో స్వల్ప మార్పు జరగనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్‌లో కొంత భాగాన్ని లబ్ధిదారుల చేతికి కొంత ,వారి బ్యాంకు ఖాతాల్లో కొంత జమ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సచివాలయ సిబ్బంది మొత్తం డబ్బులను లబ్ధిదారుల చేతికి ఇచ్చేవారు. అయితే ఇక నుంచి రూ.4000లలో.. రూ 3.800లు చేతికిస్తే, మిగతా రూ.200లు ఖాతాల్లో వేస్తారు. దీనికోసం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌‌కి వారి ఆధార్ లింక్‌ అయి ఉండాలి. పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం, నిధుల పంపిణీలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేయడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

గుంటూరు NRI దంపతుల భారీ విరాళం.. అమెరికాలోని UCSFకి 1 మిలియన్‌ డాలర్లు ఫండ్

Dr Ambati Srimannarayana Donation For UCSF In Usa: గుంటూరు నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన డాక్టర్‌ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. UCSF (యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో)కు 1 మిలియన్‌ డాలర్లు విరాళంగా అందజేశారు. డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు ఇచ్చిన ఈ విరాళాన్ని పెట్టుబడిగా ఉంచుతారు.. దాని నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అది కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్‌సిప్‌లు అందిస్తారు.

‘మీ ఆవేశం అర్థమవుతోంది.. ఈ సభలో రాజకీయాలు వద్దు.. వాళ్లు హద్దులు మీరితే యుద్ధం’: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Comments In Proddatur Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు. అందరి ఆవేశం తనకు అర్థమవుతోందని.. రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దని హితవు పలికారు. యుద్ధం వచ్చినప్పుడే మాట్లాడాలని.. అవతలివారు హద్దులు మీరితేనే కదా యుద్ధం చేయాల్సిందేనన్నారు. గొడవలు వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు కచ్చితంగా యుద్ధం చేస్తానన్నారు. ప్రస్తుతానికి అభివృద్ధి గురించి మాట్లాడతానని.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడతానన్నారు పవన్ కళ్యాణ్.

ఎమ్మెల్యే చింతమనేనిపై దుష్ప్రచారం.. టోల్ ప్లాజా ఘటనతో సంబంధం లేదు.. డ్రైవర్లు, టోల్ ప్లాజా సిబ్బంది క్లారిటీ

Eluru Lorry Drivers Clarity On Toll Plaza Incident: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధించిన టిప్పర్ల డ్రైవర్లు టోల్‌ప్లాజా దగ్గర సిబ్బందితో గొడవకు దిగారంటూ ప్రచారం జరిగింది. తాాజాగా ఈ అంశంపై చింతమనేని ప్రభాకర్, టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్లు స్పష్టత ఇచ్చారు. తాము పోలీసుల భయంతో చింతమనేని పేరు చెప్పామని లారీ డ్రైవర్లు అంటున్నారు. అసలు ఈ ఘటనకు చింతమనేనికి సంబంధం లేదని డ్రైవర్లు, టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.

శివలింగం పక్కన పడగవిప్పిన మూడు నాగుపాములు.. అద్భుత సన్నివేశం, వీడియో వైరల్!

Nellore Shiva Temple Three King Cobras Spotted: నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ మూడు నాగుపాములు కనిపించాయి. మనుబోలు చెర్లోపల్లి గేటు దగ్విగరశ్వనాథ స్వామి ఆలయం ఉంది. ఇవాళ తెల్లవారుజామున మూడు నాగుపాములు ఆలయంలోపలికి వచ్చాయి. శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి.. అనంతరం పడగవిప్పి కాసేపు అక్కడే ఉన్నాయి. ఈ సన్నివేశాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గతేడాది కూడ ఇలాగే మూడుసార్లు ఇలాంటి సన్నివేశం కనిపించింది.. వీడియోలు వైరల్ అయ్యాయి.

మార్కాపురం (దొనకొండ) టు ఒంగోలు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన.. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉపయోగంగా, ఈ రూట్‌లోనే!

Markapur To Ongole Railway Line Proposal: ఏపీలో మరో కొత్త రైల్వే ప్రతిపాదన వచ్చింది. గతంలో దొనకొండ నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ కోసం రైల్వేశాఖ ప్రతిపాదించింది. తాజాగా ఈ రైల్వే లైన్‌కు సంబంధించి మార్పులు చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దొనకొండ కాకుండా మార్కాపురం నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. మార్కాపురం నుంచి రైల్వే లైన్ ప్లాన్ చేస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఉపయోగంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది.