HomeHeadlinesభర్త, కూతురును కోల్పోయి.. కంటి చూపు పోయినా ఆర్‌ఏఎస్ సాధించిన మహిళ.. అసలెవరీ రోహిణి గుర్జర్?

భర్త, కూతురును కోల్పోయి.. కంటి చూపు పోయినా ఆర్‌ఏఎస్ సాధించిన మహిళ.. అసలెవరీ రోహిణి గుర్జర్?

డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయికి పెళ్లి చేశారు. ఇద్దరు పల్లలు పుట్టిన కొన్నేళ్లకే భర్త గుండెపోటుతో మరణించాడు. అత్తింటి వాళ్లూ ఆదరించలేదు. కానీ ఆమె తమ్ముడి సాయం, నానమ్మ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చదవడం ప్రారంభించింది. ఈ సమయంలోనే తనకు ఎంతో సాయంగా ఉన్న నానమ్మ ప్రాణాలు కోల్పోయింది. అయినా బాధను దిగమింగుకుని రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసేందుకు సిద్ధం కాగా.. పరీక్షకు పది రోజుల ముందు పెద్ద కుమార్తె చనిపోయింది. అయినా తమ్ముడి మాటలు, చిన్న కుమార్తె భవిష్యత్తు కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కానీ బిడ్డ చనిపోయిన 8 రోజులకే యాక్సిడెంట్ అయి కన్నుకు తీవ్ర గాయామైంది. చూపు మందగించింది. అయినా పరీక్ష రాసి ఆర్ఏఎస్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది రోహిణి గుర్జర్. ఆమె స్టోరీ మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments