Home Blog Page 46

Silk Cocoon: పట్టు పురుగు చేసే అద్భుతం.. ఒక్క పట్టు గూడు నుంచి కిలోమీటర్‌ దారం..!

0
Sericulture: భారతీయ సంస్కృతిలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, పండగలు, శుభకార్యాల్లో పట్టు వినియోగం అనాదిగా కొనసాగుతోంది. అయితే మనం ఎంతో విలువైనదిగా భావించే పట్టు దారం ఒక చిన్న పట్టు పురుగు గూడు నుంచే వస్తుంది. ఒక పట్టు పురుగు సుమారు 800 నుంచి 1000 మీటర్ల వరకు దారాన్ని ఉత్పత్తి చేస్తుందని ఓ రైతు వివరించారు. మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకున్న పురుగు తన రక్షణ కోసం అల్లుకునే కకూన్ నుంచే ఈ పట్టు దారం లభిస్తుందని.. పట్టు సాగును గోల్డెన్ క్రాప్‌గా భావిస్తామని అంటున్నారు.

Telangana 22A Lands Registration: సాగు భూముల్లో కట్టిన ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు సర్కార్ లైన్ క్లియర్.. కానీ 50 శాతం అదనంగా చెల్లించాల్సిందే..!

0
Telangana 22A Lands: వ్యవసాయ భూముల్లో నాలా అనుమతులు పొందకుండానే నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఇలాంటి భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఈనెల 3న మెమో జారీ చేసింది. కోర్టు కేసులు, న్యాయ వివాదాలు లేని అర్హమైన నాలా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించింది. అయితే సర్కార్ ఓ మెలిక పెట్టినట్లు తెలిసింది. నాలా రుసుముతో పాటు అదనంగా 50 శాతం చెల్లించాల్లిస్తే రిజిస్ట్రేషన్ ఉంటుందట. దీనిపై అధికారిక జీవో వెలువడాల్సి ఉంది.

Bharat Future City: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై బిగ్ అప్డేట్.. అదనంగా మరో 2292 ఎకరాల భూసేకరణ, ఈ మండలంలోనే..!

0
Future City Land Acquisition: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అవసరాల కోసం యాచారం మండలంలో అదనంగా మరో 2,292.34 ఎకరాల భూమిని సేకరించేందుకు టీజీఐఐసీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 4, 6 తేదీల్లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నజిక్ సింగారం, కొత్తపల్లి, చింతపట్ల పరిధిలోని అసైన్డ్, పట్టా భూములను సేకరించనున్నట్లు అందులో పేర్కొన్నారు. నందివనపర్తి, ఓంకారేశ్వరాలయ భూములపై గతంలో జరిగిన ప్రచారంతో పాటు తాజా నోటిఫికేషన్ల నేపథ్యంలో స్థానికంగా భూసేకరణపై ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్ KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా: GHMC కమిషనర్

0
హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ప్రణాళికపై దృష్టి సారించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌వే, ఫ్రీ లెఫ్ట్ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. గతంలో రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల ప్రణాళికను రద్దు చేసింది. ఈ క్రమంలోనే సుమారు 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ సరికొత్త ప్రణాళికతో సుమారు రూ.400 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.

హైదరాబాద్‌‌లో భారీ చోరీ.. జ్యువెలరీ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దొంగతనం

0
హైదరాబాద్‌‌లో భారీ చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి షట్టర్‌ను ధ్వంసం చేసి దుండగులు షోరూమ్‌లోకి ప్రవేశించి.. సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించగా.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. షోరూమ్‌, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Shardiay Navratri 2026: నవరాత్రులకు ముందే ఇంట్లోని ఈ 5 వస్తువులను తొలగించాలి.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Shardiay Navratri 2026: తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్విని మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో తొమ్మిది రోజుల పాటు దుర్గా మాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో కలశాన్ని స్థాపించినప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. ఇలా చేయడం వల్ల దుర్గా మాత అనుగ్రహం లభించడంతో పాటు ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నవరాత్రుల వేళ వాస్తు శాస్త్రం ప్రకారం దుర్గామాత విగ్రహాన్ని, కలశాన్ని ఏ దిశలో ఉంచాలి? ఏ పనులు చేయడం వల్ల ఇంట్లో నుంచి ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందనే విషయాలను ప్రముఖ వాస్తు నిపుణులు ‘‘చింతాడ మణికంఠ స్వామి’’ మాటల్లో తెలుసుకుందాం.

Weekly Horoscope: గురు మంగళ యోగం ప్రభావంతో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే?

Weekly Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం అక్టోబర్ 5న చంద్రుడు కర్కాటక రాశిలో నివాసం ఉంటాడు. అనంతరం అక్టోబర్ 6వ తేదీన సింహ రాశిలో, అక్టోబర్ 9న కన్యా రాశిలో, వారం చివర్లో అంటే అక్టోబర్ 11న తులా రాశిలో ప్రవేశించనున్నాడు. మరోవైపు వారం పొడవునా శుక్రుడు తులా రాశిలో వక్రమార్గంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉండగా, కుజుడు కూడా ఇదే రాశిలో నీచ స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై భావోద్వేగాలు మరియు సంబంధాల్లో ఎక్కువ ప్రభావం పడుతుంది. అంతేకాదు తులా రాశిలో బుధుడు, సూర్యుడు కన్యా రాశిలో, శని మీన రాశిలో వక్రమార్గంలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో కొన్నిరాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఇంకా కొన్ని రాశుల వారికి ఆరోగ్య పరంగా ఖర్చులు పెరగొచ్చు. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.15 లక్షల ప్యాకేజీని వదులుకొని.. ఐపీఎల్‌లో రూ.55 కోట్లు సంపాదించిన క్రికెటర్.. వెంకటేశ్ అయ్యర్ కెరీర్ ప్లానింగ్ మామూలుగా లేదు!

0
క్రికెటర్‌గా రాణించాలంటే చదువును పక్కనపెట్టాల్సి వస్తుందనేది చాలా మంది నమ్మకం. అయితే ఓవైపు క్రికెట్లో రాణిస్తూనే.. చదువులోనూ సత్తా చాటొచ్చన నిరూపిస్తున్నాడు వెంకటేశ్ అయ్యర్. ఐపీఎల్‌లో ఆధారపడ తగిన ఆటగాడిగా మారిన అయ్యర్.. ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేయడంతోపాటు.. పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఎంబీఏ పూర్తవగానే రూ.15 లక్షల ప్యాకేజీతో కార్పొరేట్ జాబ్ వచ్చినప్పటికీ.. క్రికెట్ వైపే మొగ్గు చూపిన అయ్యర్ ఇప్పటికే కేవలం ఐపీఎల్ ద్వారా రూ.55 కోట్లు సంపాదించాడు.

SIR Row: CEC జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌కు నో.. కానీ, ఎస్ఐఆర్‌ విషయంలో ఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టు సమీక్ష

0
కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తీవ్ర దుమారం రేగుతోంది. గత 10 నెలల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ తీసుకున్న నిర్ణయాలను 14 సార్లు మిగతా ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని ఇటీవల మీడియాలో వచ్చిన ఓ కథనంతో వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో సీఈసీని సస్పెండ్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈసీ నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది.

‘ఐదు హామీలతో పాటు వధువుల పథకాన్ని తీసుకురండి సార్’.. యువకుడి రిక్వెస్ట్‌తో షాకైన కర్ణాటక సీఎం

0
గ్రామాల్లో ముఖ్యంగా రైతు కుటుంబాలకు అమ్మాయిల్ని ఇచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. దీంతో 35 ఏళ్లు దాటినా చాలా మందికి ఇంకా పెళ్లిళ్లు కావడం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. తన ఆవేదనను ముఖ్యమంత్రి వద్ద వెళ్లబోసుకున్నాడు. తమకు పిల్లను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, పెళ్లి కావడం లేదనే నిరాశ చెంది జీవితంపై విరక్తితో అనేక మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వాపోయాడు. ప్రభుత్వమే ఓ పథకం ప్రారంభించాలని అతడు కోరాడు.