కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తీవ్ర దుమారం రేగుతోంది. గత 10 నెలల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను 14 సార్లు మిగతా ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని ఇటీవల మీడియాలో వచ్చిన ఓ కథనంతో వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో సీఈసీని సస్పెండ్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈసీ నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది.


