క్రికెటర్‌గా రాణించాలంటే చదువును పక్కనపెట్టాల్సి వస్తుందనేది చాలా మంది నమ్మకం. అయితే ఓవైపు క్రికెట్లో రాణిస్తూనే.. చదువులోనూ సత్తా చాటొచ్చన నిరూపిస్తున్నాడు వెంకటేశ్ అయ్యర్. ఐపీఎల్‌లో ఆధారపడ తగిన ఆటగాడిగా మారిన అయ్యర్.. ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేయడంతోపాటు.. పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఎంబీఏ పూర్తవగానే రూ.15 లక్షల ప్యాకేజీతో కార్పొరేట్ జాబ్ వచ్చినప్పటికీ.. క్రికెట్ వైపే మొగ్గు చూపిన అయ్యర్ ఇప్పటికే కేవలం ఐపీఎల్ ద్వారా రూ.55 కోట్లు సంపాదించాడు.


