Future City Land Acquisition: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అవసరాల కోసం యాచారం మండలంలో అదనంగా మరో 2,292.34 ఎకరాల భూమిని సేకరించేందుకు టీజీఐఐసీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 4, 6 తేదీల్లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నజిక్ సింగారం, కొత్తపల్లి, చింతపట్ల పరిధిలోని అసైన్డ్, పట్టా భూములను సేకరించనున్నట్లు అందులో పేర్కొన్నారు. నందివనపర్తి, ఓంకారేశ్వరాలయ భూములపై గతంలో జరిగిన ప్రచారంతో పాటు తాజా నోటిఫికేషన్ల నేపథ్యంలో స్థానికంగా భూసేకరణపై ఆసక్తి నెలకొంది.


