Telangana 22A Lands: వ్యవసాయ భూముల్లో నాలా అనుమతులు పొందకుండానే నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఇలాంటి భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఈనెల 3న మెమో జారీ చేసింది. కోర్టు కేసులు, న్యాయ వివాదాలు లేని అర్హమైన నాలా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించింది. అయితే సర్కార్ ఓ మెలిక పెట్టినట్లు తెలిసింది. నాలా రుసుముతో పాటు అదనంగా 50 శాతం చెల్లించాల్లిస్తే రిజిస్ట్రేషన్ ఉంటుందట. దీనిపై అధికారిక జీవో వెలువడాల్సి ఉంది.


