Home Blog Page 45

కొలెస్ట్రాల్‌ + గుండె జబ్బుల్ని తగ్గించే వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారీ విధానం, పక్కా కొలతలతో!

0
ఆరోగ్యం అనగానే చప్పగా ఉండే ఆహారమే తినాలా, నోరూరించే పచ్చళ్లను పూర్తిగా దూరం పెట్టాలా అంటే అవసరం లేదనే చెప్పొచ్చు! మన వంటింట్లోని వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే శక్తివంతమైన సహజ ఔషధం. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడే ఈ వెల్లుల్లిని రుచికరమైన పచ్చడిలా మారిస్తే? పక్కా కొలతలతో, నూనె, కారం సమపాళ్లలో వేసి చేస్తే రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది. మందుల అవసరం లేకుండా రక్తప్రసరణను మెరుగుపరిచే ఈ ఆయుర్వేద నిధి మీ ఇంటి భోజనంలోకి వస్తే.. ఇక రుచికి వంక లేదు.. ఆరోగ్యానికి తిరుగు లేదు.. ఆ ఫర్‌ఫెక్ట్ రెసిపీ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం..

మీ ఇంట్లో RO వాటర్‌ ప్యూరిఫయర్‌ ఉందా, నీళ్లలో TDS 25 కంటే తక్కువగా ఉంటే మంచిదా కాదా?

0
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ వాటర్‌ ఫిల్టరేషన్‌ కోసం రివర్స్ ఓస్మోసిస్ (RO) వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగిస్తున్నారు. అందులో కనిపించే TDS నంబర్‌ తక్కువగా ఉంటే ‘నీరు చాలా ప్యూర్‌గా ఉంది’ అని అనుకుంటారు. కానీ TDS 25 కంటే కూడా తక్కువగా ఉంటే మాత్రం మరో సందేహం మొదలవుతుంది. ఇంత తక్కువ TDS ఉంటే నీటిలో అవసరమైన మినరల్స్‌ కూడా లేవా? అని. మరి ROలో TDS 25 కంటే తక్కువగా కనిపిస్తే దాని అర్థం ఏమిటి? మన ఆరోగ్యంపై దాని ప్రభావం ఏంటి? తెలుసుకుందాం.

పల్లీలు తిన్నాక నీరు తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదా, ఏం చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయ్

0
​పల్లీలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. వీటిని తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. దీనికి కారణం పల్లీల్లోని మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్. వీటి వల్ల బ్లడ్ ప్రెజర్ మెరుగ్గా మారుతుంది. అంతేకాకుండా, పల్లీల్లోని ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఆకలి అవ్వదు. పీనట్స్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే తినగానే వెంటనే బ్లడ్ షుగర్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు పెరగవు. ఇన్ని లాభాలున్న పల్లీలను తింటే ఏమైనా సమస్యలు వస్తాయా అంటే కొన్ని సందర్భాల్లో అలర్జీలు వస్తాయి. అంతేకాదు, పల్లీలు తిని నీరు తాగినా సమస్యలొస్తాయని చెబుతారు. ఇందులో నిజమెంత ఇప్పుడు చూద్దాం.

నటి అనన్య పాండే చెప్పిన బ్యూటీ సీక్రెట్‌.. మన ఇంట్లో ఉండే పసుపు + తేనె + పెరుగు చాలట!

0
సెలబ్రిటీలు బ్యూటీ కోసం ఏం చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఖరీదైన ఫేషియల్స్‌, విదేశీ బ్రాండ్ల స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ వాడుతారని అనుకుంటాం. కానీ నటి అనన్య పాండే చెప్పిన స్కిన్‌కేర్‌ సీక్రెట్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన ఇంట్లో సులభంగా దొరికే పసుపు, తేనె, పెరుగు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు పదార్థాలను కలిపి ముఖానికి ఉపయోగిస్తారట. ఆ ఫేస్‌ ఫ్యాక్‌ ఏమిటో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

SBIలో రూ.1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. 1, 3, 5, 10 ఏళ్లలో చేతికి ఎంత వస్తుంది? లెక్కలు ఇవే!

0
SBI FD Calculator: స్థిరమైన రాబడి కోరుకునే వారిలో చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం రూ.1 లక్ష ఎఫ్‌డీ చేసినట్లయితే వచ్చే ఏడాది, 3, 5, 10 ఏళ్ల కాల వ్యవధులకు రాబడి ఎంత వస్తుంది? ప్రస్తుతం ఆయా కాల వ్యవధులపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ప్రకారం ఎంత వడ్డీ వస్తుంది? అనే లెక్కలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నా.. 10 శాతం కో-పే భారం తప్పదా? GIC ప్రతిపాదన, నిపుణులు ఏమంటున్నారంటే?

0
Health Insurance Co-Pay: ప్రస్తుతం ఆరోగ్య బీమా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లుల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. అయితే, ఇకపై పాలసీదారులు తమ జేబు నుంచి 10 శాతం బిల్లు కట్టాల్సి రావచ్చు. ఈ మేరకు హోల్త్ ఇన్సూరెన్స్‌లో 10 శాతం కో పేను తప్పనిసరి చేస్తూ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. జనవరి 1, 2027 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నిర్ణయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Dmart Shares Crash: డీమార్ట్ స్టాక్‌కు ఏమైంది? క్యూ2లో ఆదాయం భారీగా పెరిగినా షేరు ధర 6 శాతానికిపైగా పతనం!

0
DMart Quick Commerce Competition: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల క్యూ2 బిజినెస్ అప్డేట్ పంచుకున్న డీమార్ట్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా 6 శాతానికిపైగా పతనమైంది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ స్టాక్ పతనానికి కారణాల గురించి చూద్దాం.

RBI నుంచి గుడ్‌న్యూస్.. ఫ్లోటింగ్ రేట్ బాండ్ల వడ్డీ రేటు పెంపు.. ఏప్రిల్ 2027 వరకు వర్తింపు, కొత్త వడ్డీ రేట్లు ఇవే!

0
Floating Rate Bond 2028: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి అదిరే శుభవార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఫ్లోటింగ్ రేట్ బాండ్ల వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచే కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2028 వడ్డీ రేటును 6.17 శాతం నుంచి 6.45 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మరి ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్ల గురించిన వివరాలు తెలుసుకుందాం.

IndiGo: విమాన ప్రయాణికులకు షాక్.. టికెట్ ధరల్ని పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటన.. కారణం ఇదే!

0
IndiGo Flight Fare Hike: విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సడెన్ షాక్ ఇచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై అదనంగా ఫ్యూయెల్ ఛార్జీలు విధించనుంది. అక్టోబర్ 6 నుంచి కొత్త బుకింగ్స్‌కు ఇవి వర్తించనున్నట్లు పేర్కొంది. దేశీయ విమానాల్లో చూస్తే ఇది దూరాన్ని బట్టి రూ. 375 నుంచి రూ. 1300 వరకు, అదే అంతర్జాతీయ విమానాల్లో రూ. 1000 నుంచి రూ. 6 వేల వరకు ఛార్జీలు ఉంటాయి.

ప్లేగ్ బ్యాక్టీరియా లీక్.. రష్యన్ మహిళా శాస్త్రవేత్త మృతి.. సుమారు 200 మంది క్వారంటైన్!

సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్లేగు బ్యాక్టీరియా టెస్ట్ ట్యూబ్ పగిలి 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ దార్యా షిపిలోవా మృతి చెందడం రష్యాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో అధికారులు 200 మందిని క్వారంటైన్ చేయడంతో పాటు ఐదు ఆసుపత్రులను మూసివేశారు. అయితే ఆమె మృతికి సాధారణ నిమోనియానే కారణమని, ప్లేగు కాదని రష్యా ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.