Health Insurance Co-Pay: ప్రస్తుతం ఆరోగ్య బీమా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లుల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. అయితే, ఇకపై పాలసీదారులు తమ జేబు నుంచి 10 శాతం బిల్లు కట్టాల్సి రావచ్చు. ఈ మేరకు హోల్త్ ఇన్సూరెన్స్‌లో 10 శాతం కో పేను తప్పనిసరి చేస్తూ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. జనవరి 1, 2027 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నిర్ణయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


