DMart Quick Commerce Competition: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల క్యూ2 బిజినెస్ అప్డేట్ పంచుకున్న డీమార్ట్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా 6 శాతానికిపైగా పతనమైంది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ స్టాక్ పతనానికి కారణాల గురించి చూద్దాం.


