HomeEntertainmentమీ పోస్టుల వల్లే ఆ వీడియోకి మరింత పబ్లిసిటీ వచ్చింది... సెలబ్రెటీలపై ఆర్జీవీ ఫైర్

మీ పోస్టుల వల్లే ఆ వీడియోకి మరింత పబ్లిసిటీ వచ్చింది… సెలబ్రెటీలపై ఆర్జీవీ ఫైర్

‘దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే” పాటకు సంబంధించి జాన్వీ కపూర్ ఏఐ డీప్‌ఫేక్ వీడియో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందించిన సినీ ప్రముఖుల తీరును ఆయన తప్పుపట్టారు. సెలబ్రిటీలు వరుస ట్వీట్లు చేయడం ద్వారా ఆ అభ్యంతరకర వీడియోకు అనవసర ప్రచారం కల్పించి, కోట్లాది మంది చూసేలా చేశారని విమర్శించారు. నిజంగా చేయాల్సింది ఆ వికృత చేష్టకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడమే తప్ప, ఇలా బహిరంగంగా బాధితురాలి పేరును, కంటెంట్‌ను హైలైట్ చేస్తూ ప్రచారం చేయడం కూడా నేరమేనని ఆర్జీవీ పేర్కొన్నారు. ఆర్జీవీ లేవనెత్తిన ఈ పాయింట్‌కు నెటిజన్ల నుంచి కూడా విస్తృతంగా మద్దతు లభిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments