HomeEntertainmentనెల తిరక్కుండానే డిజిటల్ బాట... ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూరి - సుహాస్ మాస్ యాక్షన్ డ్రామా

నెల తిరక్కుండానే డిజిటల్ బాట… ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూరి – సుహాస్ మాస్ యాక్షన్ డ్రామా

కోలీవుడ్ నటుడు సూరి, తెలుగు యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ త్వరలోనే డిజిటల్ తెరపై సందడి చేయనుంది. సముద్రపు నేపథ్యం, సంప్రదాయ పడవల పందెం చుట్టూ సాగే ఈ చిత్రం థియేటర్లలో రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఘన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 8 లేదా 9 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నెల రోజులు గడవకముందే ఇంతటి భారీ హిట్ సినిమా ఓటీటీ బాట పట్టడం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments