Home Blog Page 37

Mathura: ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమంలో శిష్యుడు మృతి.. సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

0
ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలోని ప్రముఖ స్వామీజీ ఆశ్రమంలో ఓ శిష్యుడు గత భవనంపై నుంచి దూకి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రస్‌పైకి వెళ్లే ముందు ఏం జరిగింది? అనేది అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి. సెప్టెంబరు 25న ఉదయం 10.25కు గదిలో నుంచి బయటకు వచ్చిన శిష్యుడు రసిక్ దులారీ.. ఆపై 10 నిమిషాల్లోనే అతడు భవనంపై నుంచి దూకాడు. అయితే, దీనికి ముందు అతడి మర్మాంగం సగం తెగిపోయి ఉండటం సంచలనంగా మారింది.

ఫ్లైదుబాయ్ రియల్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన డాక్టర్లు

0
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ క్రాష్ యాక్స్‌తో జరిపిన ఘోర దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్.. పుర్రెకు పగులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి రావడంతో.. సౌదీ వైద్యులు ఆయనకు ఆపరేషన్ నిర్వహించి, దెబ్బతిన్న పుర్రె భాగాన్ని పునర్నిర్మించినట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను సౌదీ నుంచి అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు.

‘మేజర్ అయిన కుమార్తెను తమతోనే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరు’: అలహాబాద్ హైకోర్టు

0
వయసొచ్చిన మేజర్ అయిన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తమ వద్దే నివసించాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని, అలాంటి ఉద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే చెల్లవని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తన తల్లి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఢిల్లీలో స్వతంత్రంగా జీవిస్తున్న 25 ఏళ్ల యువతి కేసును విచారించిన జస్టిస్ సందీప్ జైన్ ధర్మాసనం.. మేజర్‌కు నచ్చిన చోట, నచ్చిన వ్యక్తితో నివసించే హక్కు ఉందని చెబుతూ సంచలన తీర్పును ఇచ్చింది.

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు.. క్యూలైన్ల రద్దీకి చెక్, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్‌తో అమ్మవారి సేవా టికెట్లు

విజయవాడలో దుర్గమ్మ దసరా ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ అందించారు. ఈ ఉత్సవాల ఆన్‌లైన్ సేవా టికెట్లను కూడా మంత్రి విడుదల చేశారు. కొండపై ఘనంగా జరగబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్నాయి. ప్రత్యేక పూజలకు సంబంధించిన సేవా టికెట్లను భక్తులు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. దీంతో క్యూలైన్లలో రద్దీ తగ్గుతుంది.

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయాలు?

Pawan Kalyan Meets Chandrababu On Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సమన్వయంపై చర్చించారు.. కూటమి వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇద్దరు నేతలు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు సమాచారం.

బస్సులో పరిచయం, ప్రేమ పేరుతో యువతికి మోసం.. ఆర్టీసీ కండక్టర్‌పై చర్యలకు ఏపీ మంత్రి ఆదేశం

Ap Minister Ramprasad Reddy Orderd Probe On A Conductor: ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ కండక్టర్‌పై చర్యలకు ఆదేశించారు. ఓ మహిళ మంత్రిని కలిసి కండక్టర్‌‌పై ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో కండక్టర్ తనను మోసం చేశాడని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కండక్టర్‌కు తాను డబ్బులు, బంగారం కూడా ఇచ్చానని.. అవి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. వెంటనే స్పందించిన మంత్రి విచారణ చేసి కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రపంచ మార్కెట్‌కు ‘స్వయం ఏపీ బ్రాండ్‌’.. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లోకి.. మీరూ ఆర్డర్ చేసుకోవచ్చు

AP Dwcra Women Product Sales From October 15: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్‌కు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు డ్వాక్రా మహిళల ఉత్పత్తుల్ని స్వయం ఏపీ బ్రాండ్‌‌ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ నెల 15 నుంచి విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్‌ మేళాలో విక్రయాలు ప్రారంభించనున్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, నాణ్యత, ప్యాకింగ్‌తో పాటుగా మార్కెటింగ్‌ వ్యవస్థను అనుసంధానం చేస్తోంది.

SRI KASHI NAYANA DAILY – 6 అక్టోబర్ 2026

మంత్రి సత్యకుమార్ చొరవతో గ్రామీణ తాగునీటి వసతుల బలోపేతం

త్రిలింగేశ్వర స్వామి ఆలయానికి విరాళం

కరాటేలో సత్తా చాటిన ధర్మవరం విద్యార్థులు

వరుస మొబైల్ చోరీల ముఠా అరెస్ట్ – CI రెడ్డప్ప

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి – INTUC నేతలు

ధర్మవరంలో ప్రభుత్వ ITI, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి – AISB జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఏఈ, లైన్‌మెన్ పోస్టులపై మంత్రి కీలక ప్రకటన

Gottipati Ravi Kumar On AE And Lineman Posts Recruitment: ఏపీ విద్యుత్‌శాఖలో ఉద్యోగాల భర్తీపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 629 ఏఈ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు.. ఇటు లైన్‌మెన్ ఉద్యోగాలను కూాడా భర్తీ చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అలాగే విద్యుత్‌శాఖలోకిసచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకున్నామన్నారు మంత్రి రవికుమార్.

తిరుచానూరు ఆలయంలో మావటిపై ఏనుగు దాడి.. శ్రీనిధి కోపంతో దాడి చేయడానికి కారణం ఏంటో తేల్చిన డాక్టర్లు

Tiruchanur Temple Elephant Attacks Caretaker Due To Hormonal Influences: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు దాడి ఘటనపై టీటీడీ అలర్ట్ అయ్యింది. తిరుపతి ఎస్వీ జూపార్క్‌ పశువైద్యుల బృందం, గోశాల అధికారులు శ్రీనిధి ఏనుగును పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించారు. హర్మోన్ల కారణంగానే ఏనుగు మావటిపై దాడిచేసినట్లు నిర్ధారించారు. వారం రోజుల పాటూ ఈ ఏనుగును మనుషులకు దూరంగా ఉంచాలని డాక్టర్లు సూచించారు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.