దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ క్రాష్ యాక్స్‌తో జరిపిన ఘోర దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్.. పుర్రెకు పగులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి రావడంతో.. సౌదీ వైద్యులు ఆయనకు ఆపరేషన్ నిర్వహించి, దెబ్బతిన్న పుర్రె భాగాన్ని పునర్నిర్మించినట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను సౌదీ నుంచి అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు.


